Liver Life | మన కాలేయం చిరంజీవ చిరంజీవ.. 100 ఏండ్లకు పైగా పనిచేస్తాయంట..!
Liver Life | మన శరీరంలో అద్భుత పనితీరు కనబరిచే కాలేయం.. మరొకరికి ప్రాణం పోస్తుంది. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కాలేయం ముక్కను మరొకరిలో అమర్చవచ్చు. మానవ కాలేయం 100 ఏండ్ల వరకు పనిచేస్తుందని అమెరికాకు చెందిన పరిశోధకులు తేల్చారు.
Liver Life | కాలేయం.. మన శరీరంలో అత్యంత పెద్ద అవయవం. జీర్ణవ్యవస్థలో కీలకమైనది. గుండె మాదిరిగానే నిరంతరం పనిచేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం మొదలుకొని శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం, రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషపదార్ధాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వచేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్ ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కాలేయం.. 100 ఏండ్లకు పైగా సమర్ధవంతంగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు.
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్ డల్లాస్, ఆండోవర్ ట్రాన్స్మెడిక్స్ , మసాచుసెట్స్ పరిశోధకులు కాలేయం పనితీరుపై పరిశోధన జరిపారు. వీరి పరిశోధనలో మానవ కాలేయం 100 ఏండ్లకు పైగా పనిచేస్తుందని తేల్చారు. అయితే, కాలేయం వందేండ్లకుపైగా సమర్ధవంతంగా పనిచేయడం అనేది దాత ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాలేయం నశించదు. దీని ముక్క మరో లివర్గా మారుతుంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు వీలుంటుంది. ఆరోగ్యవంతమైన దాత నుంచి సేకరించిన కాలేయం మార్పిడి చేసిన మరో వ్యక్తిలో 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నదని ఈ పరిశోధకులు గుర్తించారు.
ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు కాలేయాల స్థితిస్థాపకత, లక్షణాలను తెలుసుకోవడానికి పలువురు దాతల కాలేయాలను పరిశీలించారు. తమ వద్ద ఉన్న కాలేయ దాతల డాటా నుంచి వారి లివర్ వినియోగం, ఆరోగ్యంపై ఆరా తీసిన తర్వాత వాటి ప్రామాణిక పనితీరును లెక్కించినట్లు సౌత్‌వెస్ట్రన్ మెడికల్ స్కూల్ వైద్య విద్యార్థి, లీడ్ స్టడీ రచయిత యష్ కడాకియా తెలిపారు. కాలేయం మార్పిడికి ముందు దాత వయస్సు, ఆరోగ్య సమస్యలపై సమగ్ర అధ్యయనం జరిపి గ్రహీతలో ఎంత కాలం పాటు జీవించి ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు. ఈ సందర్భంగా 100 ఏండ్ల మనుగడతో పనిచేసే అద్భుత కాలేయాలను వర్గీకరించినట్లు చెప్పారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

