Parenting Tips | మా బాబు పాలు కక్కేసుకుంటాడు. కొందరు పిల్లలకు లాక్టోజ్ పడదని చదివాను. ఇదీ అలాంటిదేనా?
ఓ పాఠకురాలు
లాక్టోజ్ ఇంటాలరెన్స్.. పాలు పడకపోవడం అనే పరిస్థితి అతికొద్ది మంది పిల్లల్లో కనిపిస్తుంది. అలాంటి వారిలో పాలు తీసుకున్న ముప్పై నిమిషాల్లో వాంతులు, విరేచనాలు, మగత తదితర లక్షణాలు కనిపిస్తాయి. సమస్య ఉన్నప్పుడు.. అపారమైన పోషకాలను అందించే అమ్మపాలు సైతం వారికి విషంగానే మారతాయి. బయటి పాలు కూడా పడకపోవచ్చు.
మీ బిడ్డ విషయంలో ఇతర దుష్ప్రభావాలు కనిపించడం లేదు కాబట్టి, లాక్టోజ్ ఇంటాలరెన్స్ కాకపోవచ్చు. ఇవ్వాల్సిన పద్ధతిలో పాలు ఇవ్వడం లేదేమో మీరు. బిడ్డ పొట్ట నిండాలనే ఉద్దేశంతో అతిగా పాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే .. పిల్లలు తమదైన పద్ధతిలో వ్యతిరేకిస్తారు. చిన్నారులకు రెండేండ్లు నిండేవరకూ తల్లిపాలు తప్పనిసరి. దాంతోపాటే, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని కూడా పరిచయం చేయండి.