ముంబై : 57 ఏండ్ల వయసులోనూ కండలు తీరిన దేహం మెయింటెన్ చేసే మిలింద్ సొమన్ తరచూ తన వర్కవుట్ల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు రోల్‌మోడల్‌గా నిలుస్తుంటారు. యోగ నుంచి కార్డియో, హై ఇంటెన్సిటీ స్ట్రెంథ్ ట్రైనింగ్ వంటి వివిధ వర్కవుట్స్తోనే తాను ఈ వయసులోనూ దృఢంగా ఉండగలుగుతున్నానని ఆయన చెబుతుంటారు.
సుదీర్ఘ మారథాన్ల నుంచి పర్వత శ్రేణులు, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లను చుట్టి వస్తూ పనిలోపనిగా ఫిట్నెస్ ప్రోగ్రాంనూ కొనసాగిస్తుంటారు. ఇక ఇటీవలి ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో మిలింద్ సొమన్ పులప్స్ చేస్తూ కనిపించారు. మార్నింగ్ వర్కవుట్‌లో 15 పుల్అప్స్ చేస్తున్న వీడియోను ఆయన ఇన్‌స్టా రీల్ వీడియో షేర్ చేశారు.
ఫిట్నెస్ గేమ్‌లో టాప్‌లో ఉండాలంటే ఏం చేయాలని కొన్ని టిప్స్ కూడా మిలింద్ సొమన్ క్యాప్షన్‌లో ఇచ్చారు. ఫిట్నెస్ అంటే గంటల కొద్దీ వర్కవుట్లు చేయాలని అనుకుంటారు కానీ, రకరకాల వర్కవుట్లతో రోజుకు 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యామాయం సరిపోతుందని సొమన్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.