Black rice | నల్ల బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే మాత్రం తినకుండా ఉండలేరు..!
Black rice health benefits | మన దేశంలో చాలా తక్కువగా సాగయ్యే నల్ల బియ్యంలో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ బ్లాక్ రైస్ నిత్యం తీసుకునే అలవాటు చేసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి వాటిని కూడా..
Black rice health benefits | నల్ల బియ్యం.. ఆరోగ్యానికి కేరాఫ్ ఆడ్రస్. ఎన్నో పోషకాలతో ఉన్న ఈ నల్ల బియ్యం ఎంతో ఉత్తేజకరమైనది. మన దేశంలో తొలుత ఈ బియ్యం సాగు అసోంలో ప్రారంభమైనట్లుగా చెప్తారు. అక్కడి నుంచి చాలా ప్రాంతాలకు విస్తరించింది. ఎలాంటి చీడపీడల బాధలేని ఈ వరిసాగు కేవలం 100 రోజుల్లోనే దిగుబడి చేతికి వస్తుంది. పురాతనకాలంలో రాజుల కోసం చైనాలో ఎక్కువగా సాగు చేసేవారు. ఎన్నో పోషకాలుండే ఈ నల్లబియ్యం సాధారణ బియ్యం కంటే ఎక్కువగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.
నల్ల బియ్యంలో పోషకాలు
నల్ల బియ్యంలో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలుంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ బియ్యంలో లభించే ఆంథోసైనిన్స్ అనే పదార్థం క్యాన్సర్ కారకాలను.. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లను సమర్ధంగా అడ్డుకుంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఈ ఆంథోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఈ బియ్యం కాపాడుతుంది.
వీటిలో లభించే ఫ్లేవనాయిడ్స్, ఫైటోకెమికల్స్ డయాబెటిక్ వ్యాధివారికి ఎంతో ప్రయోజనాలను అందిస్తాయి. ఫైటోకెమికల్స్ శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చి శరీరం గ్లూకోజ్‌ను మెరుగైన రీతిలో ఉపయోగించుకునేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకుగాను చిన్న పేగుల్లో చక్కెరను త్వరగా జీర్ణమయ్యేట్లు చేస్తుంది. నిత్యం ఈ రైస్ తినడం వలన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. లివర్ డిటాక్సిఫికేషన్‌లో తోడ్పాటునందిస్తుంది. అలాగే, రక్తపోటు సమస్య నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది.
నల్ల బియ్యం అన్నంలో పోషక విలువలు
సగం కప్పు వండిన నల్ల బియ్యం అన్నంలో 173 క్యాలరీలు, 5 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల కొవ్వు, 1 మిల్లీగ్రాము ఐరన్, 38 గ్రాముల పిండి పదార్థాలు, 1 గ్రాము చక్కెర, 4 మిల్లీగ్రాముల సోడియం ఉంటాయి. వైట్, బ్రౌన్ రైస్‌తో పోలిస్తే బ్లాక్ రైస్‌లో కొలెస్ట్రాల్ అసలే ఉండదు. ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, కండరాలను పెంచే వారికి ఇది గొప్ప ఎంపిక.
ఒకసారి బ్లాక్ రైస్ తిన్నట్లయితే రోజువారీగా శనీరానికి అవసరమయ్యే 60 శాతం ఐరన్, 4 శాతం ఫైబర్ అందిస్తుంది.
నల్ల బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల బియ్యంలో ఆంథోసైనిన్స్ ఎక్కువగా ఉండి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.
డయోనియా, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో సాయపడుతుంది.
ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
కార్డియోవాస్కులర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడుతుంది.
గ్లూటెన్ రహితంగా ఉంటుంది.
దీనిలోని జియాక్సాంటిన్, లుటిన్.. కెరోటినాయడ్స్ ఆరోగ్యం మెరుగుపరుస్తాయి.
రెటీనాపై హానికారక రేడియేషన్, యూవీ కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
దృష్టి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

