న్యూఢిల్లీ : చర్మ సంరక్షణకు, సంప్రదాయ వైద్యానికి దివ్యౌషధంగా చందనాన్ని (Sandalwood) ప్రాచీనకాలం నుంచి భారతీయులు వాడుతున్నారు. చందనం వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.చర్మ సంరక్షణకు చందనం ఎలాంటి మేలు చేస్తుందో చూద్దాం..చందనం చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు డ్రై స్కిన్ కలిగిన వారికి ఎంతో ఉపయోగకరం. శ
రీరంలో ముడతలు, వయసుమీరిన లక్షణాలను నియంత్రించేందుకు చందనంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మెరుగ్గా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో దీటుగా పోరాడతాయి. చందనాన్ని నిత్యం వాడటం ద్వారా చర్మంపై ముడతలు, వృద్థాప్య ఛాయలు కనుమరుగవుతాయి. చర్మంపై మచ్చలు కూడా రోజూ చందనం రాయడంతో మటుమాయమవుతాయి.
చందనం వాడటం ద్వారా చర్మ సౌందర్యం మెరుగవడంతో పాటు ముఖవర్చస్సు ఇనుమడిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చి మునుపటి యవ్వనం తొణికిసలాడేలా చేస్తుంది. శరీరంపై పేరుకుపోయే అధిక ఆయిల్స్‌ను తొలగించి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. ఇక చందనం సహజమైన యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు, యాక్నేను నిరోధించడంలో ఉపకరిస్తుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ చందనం చురుకుగా పనిచేస్తుంది.
Read More :
Venomous Snake | విషసర్పం నుంచి స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు విడిచాడు..