Lungs health @ Winter | చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం.. ఈ జ్యూస్‌లతో పెంచుకోండి..!
Lungs health @ Winter | చలికాలంలో పలు ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని రకాల జ్యూస్‌లను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
Lungs health @ Winter | మనలో చాలా మందికి శ్వాస సమస్య వచ్చేంత వరకు తమ ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్రాముఖ్యతను గుర్తించరు. ఊపిరితిత్తులు స్వయంగా శుభ్రపరుచుకుంటాయి. అయితే కాలుష్య కారకాలు, ఇతర విషపూరిత పదార్థాలకు గురవడం వల్ల సమస్యలు వస్తుంటాయి. అలాగే, చలికాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మరింత పెరుగుతుంటాయి. ఈ సీజన్లో ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా కొంత వరకు ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తప్పనిసరిగా ఆహారంలో కొన్ని రసాలను చేర్చుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోవాలి.
నిమ్మరసం
నిమ్మరసంలో విటమిన్ సీ, కాల్షియం, మెగ్నిషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలపడేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని కాపాడుతుంది. నిత్యం ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల నడుం చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించుకోవచ్చు.
గ్రీన్ జ్యూస్
గ్రీన్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ మనలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతాయి. మొత్తం శరీరంతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి గ్రీన్ జ్యూస్ ఎంతో మంచిది. బచ్చలికూర, దోసకాయ. ఆపిల్స్, అల్లం, నిమ్మరసం జోడించి గ్రీన్ జ్యూస్‌ను తయారుచేసుకోవచ్చు. చలికాలంలో ఉదయాన్నే ఈ గ్రీన్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
దానిమ్మ రసం
దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండి శరీరంలోని కణాలు డ్యామేజి కాకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుతాయి. వ్యాధినిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శ్వాసవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. వారంలో ఓ కప్పు దానిమ్మ రసం తాగేలా ప్లాన్ చేసుకోవాలి.
పైనాపిల్ జ్యూస్
పైనాపిల్ జ్యూస్ వివిధ రోగాలకు చికిత్స చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లో మాంగనీస్, కాపర్, విటమిన్ బీ6, సీ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్ కేతోపాటు కోలిన్ లభిస్తాయి. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మెరుగైన జీవక్రియ, గుండె ఆరోగ్యం, వాపులు, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఊపిరితిత్తులను శుభ్రం చేయడంతోపాటు ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది.
టమాట రసం
టమాట జ్యూస్‌లో బీటా కెరోటిన్, లైకోపీన్ల వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు, కొవ్వు వంటి సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. టమాట జ్యూస్ గుండెతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారంలో ఒకసారైనా టమాట జ్యూస్ తాగడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈ జ్యూస్‌ను పరగడుపునే తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
ఆపిల్ జ్యూస్
ఆపిల్ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ఆపిల్ జ్యూస్ ఎంతో సాయపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. సీఓపీడీని కూడా నివారిస్తుంది. రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కార్డియోవాస్కులర్ సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

