Hair fall | వానాకాలంలో జుట్టు రాలిపోవద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Hair fall | ఈ సీజన్లో వెంట్రుకలు తీవ్రంగా రాలిపోతాయని అంటారు. అసలే నాది బలహీనమైన జుట్టు. మాలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
Hair fall | ఈ సీజన్లో వెంట్రుకలు తీవ్రంగా రాలిపోతాయని అంటారు. అసలే నాది బలహీనమైన జుట్టు. మాలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
– ఓ పాఠకురాలు
వానకాలం వెంట్రుకలకు శత్రువు లాంటిది. మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. జడ పలచబడిపోతుంది. తడి వాతావరణంలో చుట్టుపక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చర్మ రోగాలు పుట్టుకొస్తాయి. చుండ్రు తిష్టవేస్తుంది. జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా పొడిబారుతుంది. దురదగానూ అనిపించవచ్చు. తగిన జాగ్రత్తలతో ఈ సమస్యల్ని నివారించడం సాధ్యమే.
- వర్షంలో తడవకండి. తడిసినా వెంటనే పొడి తువ్వాలుతో తుడుచుకోండి. అప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి వద్దు.
- వారానికి కనీసం మూడుసార్లు తలస్నానం చేయండి. దీంతో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి.
- హెయిర్ డ్రయర్ వాడకపోవడమే మంచిది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే వేడి జుట్టుకు హాని చేస్తుంది.
- తలకు రసాయన షాంపూ హానికరం. సాధ్యమైనంత వరకూ సహజమైన ఉత్పత్తులే వాడండి.
- మంచి కండిషనర్ ఉపయోగించండి.
- ఒత్తిడి తగ్గించుకోండి.
- పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి.
- తీవ్రంగా జుట్టు రాలుతున్నా, చుండ్రు వేధిస్తున్నా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
డాక్టర్ అనున్యా రెడ్డి
ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

