Hot Water | వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లు తాగితే మంచిదేనా?
దప్పిక వేయగానే మంచినీళ్లు కావాలనిపిస్తుంది. ఎండకాలం అయితే ఫ్రిజ్లోంచో, కుండలోంచో తీసుకుంటాం. కానీ, చైనా సంప్రదాయం ప్రకారం వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లను తాగడమే మంచిది.
Hot Water | దప్పిక వేయగానే మంచినీళ్లు కావాలనిపిస్తుంది. ఎండకాలం అయితే ఫ్రిజ్లోంచో, కుండలోంచో తీసుకుంటాం. కానీ, చైనా సంప్రదాయం ప్రకారం వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లను తాగడమే మంచిది. చైనా వైద్యంలో ‘యిన్-యాంగ్’ అనే భావనలు ఉంటాయి.
యిన్ కిందికి వచ్చే చల్లని నీళ్లు తాగితే శరీర సమతౌల్యం దెబ్బతింటుంది. అందుకే, వేడినీళ్లు కానీ, గోరువెచ్చటి నీళ్లు కానీ ఎంచుకోవాలని అంటారు. తగిన మోతాదులో నీళ్లు తాగితే శరీరంలో తేమ ఉంటుందని తెలిసిందే. అదే వేడినీళ్లు తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అలాగని అతిగా తాగొద్దనీ హెచ్చరిస్తున్నారు.
- చలికి వణుకుపుడుతుంది. దీంతో శరీరం వెచ్చబడుతుంది. అదే వేడినీళ్లు తాగితే వణుకు తగ్గుతుంది. దీనివల్ల శరీర శక్తి ఎంతో ఆదా అవుతుంది.
- వేడినీళ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇది చెమటకు, మూత్రానికి కారణమవుతుంది. అలా శరీరంలో వ్యర్థాలు బయటికి వెళ్లడానికి దోహదం చేస్తుంది.
- జలుబు, దగ్గు బాధిస్తున్నప్పుడు వేడినీళ్లు ఉపశమనం కలిగిస్తాయి.
- వేడినీటి ఆవిరిని పీల్చడం ద్వారా సైనస్, అలర్జీలు, గొంతులో కఫం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- వేడినీళ్లు చర్మకణాలను పునరుత్తేజితం చేస్తాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ ముప్పును తగ్గిస్తాయి. వయసు మీదపడటాన్ని నివారిస్తాయి.
- తగినన్ని నీళ్లు తాగకపోతే కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. కొత్త అధ్యయనాల ప్రకారం.. వేడినీళ్లు తాగితే మానసికంగా సంతృప్తి లభించిన అనుభూతి కలుగుతుందట.
- సాయంత్రం వేళలో వేడినీళ్లు తాగితే విశ్రాంతిగా ఉంటుందట. మానసిక ఒత్తిడి తగ్గి, శరీరం రాత్రి నిద్రకు సిద్ధమవుతుందని చెబుతారు.
- జీవాధారమైన నీటిని తగిన మోతాదులో తాగుతూనే ఉండాలి. వేడినీళ్లకు కొంచెం నిమ్మరసం, అల్లం చేర్చుకుంటే మరీ మంచిది. విటమిన్ సి ప్రయోజనాలు కూడా అందుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

