ఎఫ్‌డీఏ ఆమోదానికి ముందే కొవిడ్ బూస్టర్ డోస్‌లకు రెడీ!

జెరూసలెం : డెల్టా వేరియంట్ నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను 60 ఏండ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు ఇజ్రాయల్ యోచిస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదానికి ముందే బూస్టర్ డోస్‌ను వయోవృద్ధులకు ఇచ్చే దిశగా కసరత్తు సాగుతోందని ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. నిర్ధిష్టంగా ముప్పు ఉన్న గ్రూపులకు బూస్టర్ డోసులు ఎంతవరకూ అవసరమనే విషయంపై అమెరికా, ఐరోపా దేశాలు పరిశోధన చేపట్టాయి.
వైనెట్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇజ్రాయల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నచ్‌మన్ యాష్ మాట్లాడుతూ బూస్టర్ డోస్‌పై సందిగ్ధత నెలకొందని, ప్రపంచం అండదండలు లేకుండా నిర్ణయం తీసుకోవడం బాధ్యత మన భుజాలపై వేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఓవైపు బూస్టర్ డోస్ సురక్షితంగా ఉండేలా, ప్రభావవంతంగా పనిచేసేలా చూడటంతో పాటు మరోవైపు మహమ్మారి వ్యాప్తిని మనం అడ్డుకోవాలని ఈ దిశగా ఇది ఓ సవాల్ వంటిదని స్పష్టం చేశారు.
ఫైజర్ ఇప్పటికే టీకా మూడవ డోస్ అత్యవసర వాడకానికి ఎఫ్‌డీఏ ఆమోదం కోరుతోంది. బూస్టర్ డోస్‌తో కరోనా వేరియంట్ల నుంచి ప్రజలకు అత్యధిక రక్షణ సమకూరుతుందని ఫైజర్ చెబుతోంది. మరోవైపు రిస్క్ గ్రూపులకు కేసు తీవ్రత ఆధారంగా ఈ నెల నుంచి ఇజ్రాయిల్ బూస్టర్ డోస్‌లను ఆఫర్ చేసేందుకు సిద్ధమైంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

