Stress | ఒత్తిడి అధికంగా ఉంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకున్నా వృథాయే.. ఏం చేయాలంటే..?
కాంబుచా తాగుతున్నారా, ప్రోబయోటిక్స్ తీసుకుంటున్నారా, గట్ (జీర్ణవ్యవస్థ)కు మంచిదని చెప్పే పర్ఫెక్ట్ డైట్ పాటిస్తున్నారా.. అయినా పొట్ట ఉబ్బరం తగ్గడంలేదా? అయితే దీనికి కారణం ఒత్తిడి కావచ్చని వైద్యులు చెబుతున్నారు. సలాడ్లు తిన్నా, కాంబుచా తాగినా, ప్రోబయోటిక్స్ తీసుకున్నా, ఒత్తిడిలో ఉంటే కడుపు ఉబ్బరం సమస్య తలెత్తే అవకాశం ఉంది.
Stress | కాంబుచా తాగుతున్నారా, ప్రోబయోటిక్స్ తీసుకుంటున్నారా, గట్ (జీర్ణవ్యవస్థ)కు మంచిదని చెప్పే పర్ఫెక్ట్ డైట్ పాటిస్తున్నారా.. అయినా పొట్ట ఉబ్బరం తగ్గడంలేదా? అయితే దీనికి కారణం ఒత్తిడి కావచ్చని వైద్యులు చెబుతున్నారు. సలాడ్లు తిన్నా, కాంబుచా తాగినా, ప్రోబయోటిక్స్ తీసుకున్నా, ఒత్తిడిలో ఉంటే కడుపు ఉబ్బరం సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాంబుచా అనేది గ్యాస్ కలిగిన ప్రోబయోటిక్ పానీయం. ఇది గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే ఒత్తిడి సమయంలో శరీరం సర్వైవల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. దీని ప్రభావంగా జీర్ణక్రియ మందగిస్తుంది.
ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగేది ఇదే..
మనిషి స్ట్రెస్‌లో ఉన్నప్పుడు రక్తప్రసరణ పొట్ట నుంచి ఇతర అవయవాల వైపు మళ్లుతుంది. జీర్ణక్రియ ఎంజైమ్స్ పనితీరు తగ్గిపోతుంది, పొట్టలో ఆమ్లం స్థాయి పడిపోతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా అది పొట్టలో సరిగ్గా జీర్ణం కాకుండా ఉండిపోతుంది. దీంతో బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం), అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఇలా నిరంతరం బ్లోటింగ్, అసిడిటీ, గ్యాస్ సమస్యలు కొనసాగితే దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఇర్రిటబుల్ బావెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా గట్ ఆరోగ్యం కేవలం ఆహారంపై మాత్రమే ఆధారపడదని నాడీ వ్యవస్థపై కూడా ఆధారపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీర్ణక్రియ మెరుగుపడేందుకు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడం కూడా కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేయండిలా..
భోజనం ప్రారంభించే ముందు ప్రశాంతంగా ఉండటం ఎంతో ముఖ్యం. భోజనం చేసే ముందు 3 నుంచి 5 సార్లు నెమ్మదిగా లోతైన శ్వాసలు తీసుకోవడం ద్వారా రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ యాక్టివ్ అవుతుంది. దీని వల్ల పొట్టలో ఆమ్లం, ఎంజైమ్స్ విడుదల మెరుగుపడుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా ఉపయోగకరం. ఇవి నర్వస్ సిస్టమ్‌ను రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలు, బాదం, పాలకూర, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్ వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల తగినంత మెగ్నీషియం అంది నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అల్లం, కామొమైల్, సోంపు, పుదీనా వంటి హెర్బల్ టీలు తాగడం ద్వారా గట్ మాత్రమే కాదు, నర్వస్ సిస్టమ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది.
నెమ్మదిగా తినాలి..
ఇక భోజనం వేగంగా చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిలో త్వరగా తినడం బ్లోటింగ్‌ను మరింత పెంచుతుంది. అందుకే నెమ్మదిగా నములుతూ తినడం అలవాటు చేసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచడం కూడా స్ట్రెస్ తగ్గించడంలో కీలకం. ప్రతి భోజనంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకర కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇక రోజుకు కనీసం ఐదు నిమిషాల పాటు లోతైన శ్వాసాభ్యాసం, చిన్న వాకింగ్ లేదా సూర్యకాంతి పొందడం కూడా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గట్ హెల్త్ అనేది కేవలం ప్లేట్లో ఏముంది అనేదానిపై మాత్రమే ఆధారపడదు. నర్వస్ సిస్టమ్ స్థితి కూడా అంతే ముఖ్యమైనది. జీర్ణక్రియ ఎప్పుడూ ప్రశాంత పరిస్థితుల్లోనే బాగా పనిచేస్తుంది, తొందరపాటు, ఒత్తిడిలో కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- stress
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

