తీసుకోండి.. కోలుకోండి!
జలుబు చేసినప్పుడు కోడిపులుసు తాగితే ముక్కుదిబ్బడ వదులుతుందని మనకు తెలుసు. కోడి పులుసులో క్యాలరీలు, క్యాల్షియం, విటమిన్లు, మినరల్స్ పుష్కలం.
కొన్ని పదార్థాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు. తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సమయంలో ఎక్కడలేని శక్తినిస్తాయి.
కోడిపులుసు
జలుబు చేసినప్పుడు కోడిపులుసు తాగితే ముక్కుదిబ్బడ వదులుతుందని మనకు తెలుసు. కోడి పులుసులో క్యాలరీలు, క్యాల్షియం, విటమిన్లు, మినరల్స్ పుష్కలం. దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు సహజంగానే నిస్సత్తువగా ఉంటారు. కోడిపులుసులోని ఎలక్ట్రోలైట్స్ మనసును ఉత్సాహ పరుస్తాయి. శరీరంలో తేమ పెరుగుతుంది.
వెల్లుల్లి
శతాబ్దాల నుంచి వెల్లుల్లిని వంటింటి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ నుంచి కాపాడే గుణం వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లి రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
చాయ్
జలుబు, ఫ్లూ ఇబ్బంది పెడుతున్నప్పుడు వేడివేడి చాయ్ తాగితే రిలీఫ్ వస్తుంది. సైనసైటిస్ సమస్యతో బాధపడేవారిలో అధిక మ్యూకస్ తొలగిపోతుంది. టీలోని పాలీఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. బ్లాక్ టీ శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది.
చారు
చారులో క్యాలరీలతోపాటు విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, ఫోలేట్, క్యాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకలు త్వరగా గట్టిపడి బలహీనత నుంచి బయట పడతారు.
అరటిపండ్లు
అరటిపండ్లు త్వరితంగా శక్తినిస్తాయి. ఇందులో శక్తినిచ్చే క్యాలరీలతోపాటు పోషకాలూ అత్యధికం. వాంతులు, విరేచనాలు తదితర
సమస్యను తగ్గిస్తాయి.
తేనె
జబ్బున పడినవాళ్లు త్వరగా కోలుకోవడానికి తేనె ఉపకరిస్తుంది. తేనె హానికర బ్యాక్టీరియాను, ప్రాణాంతక సూక్ష్మజీవులను అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. గొంతు సమస్యలు ఉన్నవారు రోజూ ఓ టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటే సమస్య మటుమాయం ఖాయం.
ఓట్స్
క్యాలరీలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాపుల్ని తగ్గిస్తాయి. జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థితికి తెస్తాయి.
పెరుగు
పెరుగులో క్యాలరీలు, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలం. పెరుగులోని మంచి బ్యాక్టీరియా వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. జబ్బున పడ్డవాళ్లు వేగంగా కోలుకుంటారు.
పండ్లు
పండ్లలో క్యాలరీలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ. పండ్లు, పండ్లరసాలు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. పండ్లలో వ్యాధి నిరోధకతను పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ ఉంటాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

