Late Night Dinner | రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే ఎన్ని అనర్థాలు సంభవిస్తాయో తెలుసా..?
ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారింది. అందరూ అన్నింట్లోనూ వేగాన్ని కోరుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనూ వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రజలు కూడా వేగంగా పనులు జరగాలని ఆశిస్తున్నారు.
Late Night Dinner | ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారింది. అందరూ అన్నింట్లోనూ వేగాన్ని కోరుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనూ వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రజలు కూడా వేగంగా పనులు జరగాలని ఆశిస్తున్నారు. ఇక ఆహారం విషయంలోనూ ప్రజలు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. చాలా వేగంగా భోజనం చేస్తున్నారు. ఆహారం విషయంలో చాలా హడావిడి కనబరుస్తున్నారు. ఆహారంపై అసలు శ్రద్ధ పెట్టడం లేదు. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనే విషయంపై స్పష్టత ఉండడం లేదు. ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. జంక్ ఫుడ్ తినడం ఎక్కువైంది. ఇళ్లలో వండుకోవడం లేదు. ఎక్కువగా బయటి ఆహారాలను తినేందుకే ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రాత్రి పూట కూడా ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి దినచర్య మనకు అనేక అనర్థాలను కలగజేస్తోంది.
మెదడు పనితీరుకు..
రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చాలా మంది ఈ విధమైన జీవనశైలినే కలిగి ఉంటున్నారు. అయితే ఇలా పాటించడం వల్ల అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ విధంగా ఆహారపు అలవాట్ల వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల సర్కేడియన్ వ్యవస్థ దెబ్బ తింటుందని అంటున్నారు. దీంతో మెదడు పనితీరు మందగిస్తుంది. నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. మతిమరుపు వస్తుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ బారిన పడతారు. ఇక రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు అధికంగా చేరుతాయి. దీంతో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, నడుము వద్ద విపరీతంగా కొవ్వు చేరుతుంది. దీంతో ఆ కొవ్వును కరిగించడం చాలా కష్టంగా మారుతుంది.
జీర్ణ వ్యవస్థకు..
రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే కొన్ని రోజులకు కొంత మందికి నైట్ ఈటింగ్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల రాత్రి పూట ఆహారం తిన్నా కూడా కాసేపటికి మళ్లీ ఆకలి అవుతుంది. దీంతో అధికంగా ఆహారం తింటారు. ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. దీని వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా అజీర్తి ఏర్పడుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. దీనికి తోడు మలబద్దకం కూడా ఏర్పడుతుంది. మరుసటి రోజు విరేచనం సరిగ్గా అవదు. దీంతో దీర్ఘకాలంలో పైల్స్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉండడం వల్ల శరీరంలో రక్త సరఫరా మందగిస్తుంది. దీంతో బీపీ పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
ఏ సమయంలోగా తినాలి..?
ఈ రకమైన జీవనశైలిని కలిగి ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే రాత్రి పూట ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది కనుక నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. తరచూ ఇలా జరుగుతుంటే స్ట్రోక్స్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. కనుక రాత్రి పూట వీలైనంత త్వరగా భోజనం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి పూట 7.30 గంటల లోపు భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. ఇక రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. కారం, మసాలాలు, నూనెలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. ఈ విధమైన జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు. రోగాల బారిన పడకుండా ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవిస్తారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

