Zumba Dance | డెలివరీ తర్వాత జుంబా డ్యాన్స్‌తో ఫిట్నెస్ తిరిగి పొందవచ్చా?
Zumba Dance | డాక్టర్ గారూ నమస్తే. నాకు 20 రోజుల క్రితం నార్మల్ డెలివరీ అయ్యింది. జుంబా డ్యాన్స్ సాయంతో ప్రెగ్నెన్సీ తర్వాత ఫిట్నెస్ తిరిగి పొందవచ్చని నా స్నేహితులు చెబుతున్నారు. ఎప్పటినుంచి నేను జుంబా తరగతులకు వెళ్లొచ్చు.
Zumba Dance | డాక్టర్ గారూ నమస్తే. నాకు 20 రోజుల క్రితం నార్మల్ డెలివరీ అయ్యింది. జుంబా డ్యాన్స్ సాయంతో ప్రెగ్నెన్సీ తర్వాత ఫిట్నెస్ తిరిగి పొందవచ్చని నా స్నేహితులు చెబుతున్నారు. ఎప్పటినుంచి నేను జుంబా తరగతులకు వెళ్లొచ్చు. దీనివల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా? సిజేరియన్ అయితే, ఎన్నో నెల నుంచి డ్యాన్స్ మొదలు పెట్టవచ్చు. మీ సలహా కావాలి.
– ఓ పాఠకురాలు
జుంబా డ్యాన్స్‌ను చాలామంది బరువు తగ్గే వ్యాయామంగా చూస్తారు. అది నిజమే. లావు తగ్గితే చక్కటి ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. సాధారణంగానే కాదు, ప్రసవం తర్వాత కూడా ఇది పనికొస్తుంది. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో నడుము, పొట్ట, కటి ప్రాంతాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అవన్నీ తిరిగి మామూలు స్థితికి రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది.
అందుకే ప్రసవమైన ఆరు వారాల తర్వాత నుంచి నడకతో పాటు, యోగా, చిన్నపాటి వ్యాయామాలు ప్రారంభించవచ్చు. జుంబా కాస్త ఎక్కువగా శరీరాన్ని కదిలించే ప్రక్రియ. అందుకే కనీసం మూడు నెలల తర్వాత నుంచీ మొదలు పెట్టడం మంచిది. తొలి దశలో చిన్నచిన్న స్టెప్స్ చేస్తూ క్రమంగా ముందుకు వెళ్లవచ్చు. నార్మల్, సిజేరియన్.. ఏ డెలివరీ అయినా సరే ఇలా చేయడమే మంచిది.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

