Fresh Mutton | ప్రస్తుతం ఏది చూసినా కల్తీ అవుతుంది. తాజా పదార్థాలే దొరకడం కష్టమైపోతుంది. ముఖ్యంగా మాంసాహార ప్రియులకు తాజా మాంసం దొరకడమే అసాధ్యమైపోయింది. మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా కుళ్లిపోయిన.. ఎప్పుడో కట్ చేసిన మాంసాన్ని మార్కెట్లో విక్రయిస్తుంటారు. మరి మనం కొనే మాంసం తాజాదేనా? కాదా? అనేది ఎలా గుర్తించాలి? దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..
🐐 మంచి మటన్, చికెన్ తాజాగా కనిపిస్తుంది. ఫ్రెష్ కాకపోతే పాలిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది.
🐐 మటన్ నుంచి రక్తం, నీరు కారుతుంటే దాన్ని తీసుకోకూడదు.
🐐 బాగా ఎరుపు రంగులో ఉండే మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అది ముదిరిపోయిన మటన్ అని తాజాది కాదని గ్రహించాలి.
🐐 గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితే ఆరోగ్యానికి మంచిది.
🐐 చాలా మంది బోన్‌లెస్ మటన్ తింటుంటారు. అయితే బోన్‌లెస్ కన్నా బోన్ మటన్ రుచిగా ఉంటుంది. పైగా బోన్స్ ఉన్న మటనే త్వరగా ఉడుకుతుంది. దీనికి తోడు మటన్‌లోని పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక బోన్స్ మటనే ఆరోగ్యానికి మంచిది.
🐐 ఆన్లైన్లో మటన్ ఆర్డర్ ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్లు ఎలాంటి మటన్ తెస్తారో మనకు తెలియదు.
“ఆన్లైన్లో ఆర్డరిస్తే ఇంటికే నాన్ వెజ్.. వీటితో లాభమా? నష్టమా?”
మీ తేనె స్వచ్ఛమైనదేనా? కల్తీని ఎలా గుర్తించాలి?
“గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?”