Honey

క‌ల్తీ తేనెను ఎలా గుర్తించాలి?

Household Tips

తేనె స‌ర్వ‌రోగ నివారిణి అంటారు. కానీ ఈ రోజుల్లో దొరికే క‌ల్తీ తేనె తీసుకుంటే లేనిపోని రోగాలు వ‌స్తాయి. మ‌రి తేనె క‌ల్తీ అయ్యింది? లేనిది ఎలా తెలుసుకోవాలి?

ఒక గ్లాస్‌లో కొన్ని నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఆ తర్వాత కాస్త వెనిగర్ వేయాలి. నురుగు వస్తే అది కల్తీ తేనె.

01

అగ్గిపుల్లను తీసుకొని తేనెలో ముంచాలి. ఆ పుల్లను అగ్గిపెట్టెపై గంధకానికి గీస్తే మండాలి. లేదంటే అది కల్తీ తేనె.

02

అగ్గిపుల్లను తీసుకొని తేనెలో ముంచాలి. ఆ పుల్లను అగ్గిపెట్టెపై గంధకానికి గీస్తే మండాలి. లేదంటే అది కల్తీ తేనె.

03

ఎందుకంటే స్వచ్ఛమైన తేనెకు మండే స్వభావం ఉంటుంది. నాణ్యమైన తేనెలో పత్తి ఒత్తిని ముంచి వెలిగిస్తే వెలుగుతుంది.

గ్లాస్ మంచి నీటిలో టేబుల్ స్పూన్ తేనె వేయాలి. చెంచాతో కలపకుండా గ్లాస్‌ను అటూ ఇటూ తిప్పుతూ కలపాలి. తేనె నీటిలో కలిసిపోతే అది కల్తీది. 

04

బ్లాటింగ్ పేపర్‌కు కాస్త తేనె రాయాలి. పేపర్ తడిసిపోతే అది కల్తీ తేనెగా భావించాలి.

05

చేతి బొటనవేలిపై కొంచెం తేనె వేయండి. చేతికి అలాగే అతుక్కుపోతే అది నాణ్యమైన తేనె. వేలి నిండా వ్యాపించి జారిపోతే అది కల్తీదని గుర్తించాలి.

06