Health Tips | రోజూ ఎంత ప్రొటీన్ తీసుకుంటే మేలు..!
శరీరం కీలక విధులను నిర్వర్తించేందుకు, జీవక్రియల వేగం పెంచేందుకు తగినంత ప్రొటీన్ (Health Tips) అత్యవసరం. శరీరానికి అత్యంత అవసరమైన మూడు సూక్ష్మపోషకాల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్లతో పాటు ప్రొటీన్ ఒకటి.
న్యూఢిల్లీ : శరీరం కీలక విధులను నిర్వర్తించేందుకు, జీవక్రియల వేగం పెంచేందుకు తగినంత ప్రొటీన్ (Health Tips) అత్యవసరం. శరీరానికి అత్యంత అవసరమైన మూడు సూక్ష్మపోషకాల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్లతో పాటు ప్రొటీన్ ఒకటి. కండర నిర్మాణానికి, బరువు నియంత్రణకు, చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఊడకుండా నిరోధించడంతో పాటు ప్రొటీన్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్‌లా మన శరీరం ప్రొటీన్‌ను నిల్వ చేసకోదు కాబట్టి రోజువారీ తీసుకునే ఆహారంలో ప్రొటీన్ విధిగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
దైనందిన జీవితంలో తగినంత ప్రొటీన్ తీసుకోకుంటే కండరాల బలహీనత, బరువు పెరగడం, అలసట, ఏకాగ్రత కొరవడటం వంటి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని పోషకాహార నిపుణులు, హెల్త్ కోచ్ శిల్పా అరోరా చెబుతున్నారు. ప్రొటీన్‌ను అధికంగా తీసుకున్నా, దాన్నిసరిగ్గా జీర్ణం చేసుకోలేకపోయినా ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అసలు ప్రతి వ్యక్తి తన బరువులో కిలోకు 0.8 గ్రాముల చొప్పున ప్రొటీన్‌ను తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ దీప్తి జైన్ తెలిపారు.
ఉదాహరణకు 65 కిలోల వ్యక్తి రోజుకు 52 నుంచి 65 గ్రాముల వరకూ ప్రొటీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే వయసు, బరువు, ఫిట్నెస్, చేసే పనులు, ఆరోగ్య పరిస్ధితుల ప్రకారం ఆయా వ్యక్తులు తమకు తగినంత ప్రొటీన్‌ను తీసుకోవాలి. ఇక ప్రొటీన్ సరిగ్గా జీర్ణమయ్యేందుకు, రక్తం గడ్డకట్టడాన్ని నివారించేందుకు, ఇన్ప్లమేషన్ నిరోధించడం వంటి ప్రయోజనాల కోసం ప్రొటీయోలిటిక్ ఎంజైమ్‌లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఎంజైమ్స్ అధికంగా పపాయ, పైనాపిల్, కివీ, పులిసిన కూరగాయలు, అల్లం, పెరుగు వంటి ఆహార పదార్ధాల్లో అధికంగా ఉంటాయని న్యూట్రిషనిస్ట్ సిమ్రున్ చోప్రా చెప్పారు.
Read More :
Udhayanidhi Stalin | ఉదయనిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు : హిందూ మున్నాని నేత అరెస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

