High Processed food | హై ప్రాసెస్ ఫుడ్స్‌తో అనర్ధాలు అన్నీ ఇన్నీ కావయా..! తేల్చిన పరిశోధన
High Processed food | ఎక్కువ మొత్తంలో ప్రాసెస్ చేసిన ఆహారాలనే మనం తింటున్నాం. వాటిని వాడితే ఫ్యాషన్ అని మురిసిపోతున్నాం. అయితే, వాటిని తినడం ద్వారా అకాల మరణాలు కూడా సంభవిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
High Processed food | మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు ఉండే సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మన ఆహారాపుటలవాట్లే మన ఆరోగ్య ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటి భోజనాలకు బదులుగా రెడీ టూ ఈట్ పదార్థాలపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నాం. ఆయా పదార్థాల్లో ఏఏ రసాయనాలు కలుపుతున్నారు.. అవి మనకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయనే సోయి లేకుండా వాటిని తినేస్తున్నాం. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను మెడకు కట్టుకుంటున్నాం.
ఎక్కువ మొత్తంలో ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం ఫ్యాషన్‌గా మారింది. మనకు అవసరం లేకున్నా వాటినే వాడుతూ గొప్పగా ఫీలవుతున్నాం. ఆల్ట్రా ప్రాసెస్ చేయడం వల్ల ఆయా ఆహార పదార్థాల్లో పోషక విలువలు జీరో అవుతాయి. సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై రాసే హెచ్చరికలను మనం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిపుణులు చెప్తున్నా మనం చెవికెక్కించుకోవడం లేదు. ఇవి మన శరీర వ్యవస్థలకు హాని కలిగిస్తాయని తెలిసినా వాటినే తింటున్నాం.
హై ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అకాల మరణాల ప్రమాదం పొంచి ఉన్నదని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం నివేదికను అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం.. అకాల, నివారించదగిన మరణాలతో ఎలా ముడిపడి ఉన్నదనే ఈ నివేదికలో స్పష్టం చేశారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను ఎక్కువగా వినియోగించడం అకాల మరణాలకు కారణమని పరిశోధకులు కనుగొన్నారు.

సంక్రమించని వ్యాధుల నుంచి నివారించదగిన మరణాలలో 21.8 శాతం అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగమే కారణమని ఈ నివేదిక విశ్లేషణ పేర్కొన్నది. ‘ఇది తమ పరిశోధన తొలి అధ్యయనం. వాస్తవానికి ప్రతి ఏటా మరణాలపై ఆల్ట్ర ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రభావం ఎలా ఉన్నదనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ హై ప్రాసెస్ ఆహారాలను తీసుకోవడం వల్ల అకాల మరణాలు సంభవిస్తాయి. దశాబ్దకాలం నాటి స్థాయిలోనే ఆహారాల ప్రాసెస్ ఉన్నట్లయితే 21 శాతం అకాల మరణాలను నివారించే వీలున్నది’ అని సెంటర్ ఫర్ ఎపిడెమియోలాజికల్ రీసెర్చ్ ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో వైద్యనిపుణుడు, అధ్యయన వ్యాసకర్త ఎడ్వర్డో ఏఎఫ్ నిల్సన్ పేర్కొన్నారు. ప్రాసెస్ చేయని ఆహారాల ద్వారానే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఈ అధ్యయనం సూచిస్తున్నదని నిల్సన్ చెప్పారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

