Eggs | గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్..ఎందుకంటే..!
సంపూర్ణ ఆహారంగా పేరొందిన కోడిగుడ్డును (Eggs) క్రమం తప్పకుండా తీసుకుంటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఆహారం, యోగ, వ్యాయామం, ధ్యానం వీటన్నింటినీ పాటిస్తే మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ : సంపూర్ణ ఆహారంగా పేరొందిన కోడిగుడ్డును (Eggs) క్రమం తప్పకుండా తీసుకుంటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఆహారం, యోగ, వ్యాయామం, ధ్యానం వీటన్నింటినీ పాటిస్తే మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. మంచి ఆహారం అనగానే శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషకాల గనిగా ఎగ్‌ను ముందువరసలో చేర్చాలి. ఎగ్‌తో రుచికరమైన డిష్‌లను చేసుకోవడమే కాదు అది శరీరానికి ఉత్తేజాన్నిచ్చే పోషకాలతో నిండిఉంటుంది.
ఎగ్లో ప్రొటీన్ అధికంగా ఉండటంతో పాటు అత్యవసర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఎగ్లో విటమిన్ ఏ, బీ5, బీ12, డీ, ఈ, కే, బీ6, ఫోలేట్, ఫాస్పరస్, సెలీనియం, క్యాల్షియం, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఎగ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందుతాయి. శరీరంలో ఎముకలు, కండరాల బలోపేతానికి చర్మం, మృదులాస్ధిని కాపాడేందుకు ప్రొటీన్లు అవసరం.
ఇక ఎగ్స్‌లో చర్మ సంరక్షణకు అవసరమైన విటమిన్లు బీ2, బీ5, బీ12 ఉండటంతో చర్మాన్ని కాపాడటంతో పాటు వాపు ప్రక్రియనూ నివారిస్తాయి. వీటిలో ఉండే ఏ విటమిన్లు, బయోటిన్, విటమిన్ ఈ, ఫోలేట్ జుట్టును స్ట్రాంగ్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. ఎగ్స్‌లో లభించే విటమిన్ ఏ, విటమిన్ ఈ వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దృష్టిలోపాలను నివారించడంతో పాటు సరైన చూపును ఇచ్చేందుకు ఇవి ఉపకరిస్తాయి.
Read More :
Viral Video | మోమోస్ విక్రయిస్తున్న ఇంగ్లీష్ ప్రొఫెసర్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- B12
- B5
- eggs
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

