షుగర్ పేషెంట్లు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి..?

హైదరాబాద్: ఈ రోజుల్లో షుగర్ సర్వసాధరమైన వ్యాధిగా మారిపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారినపడితే దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఒక్కటే మార్గం. స్నాక్స్ విషయంలోనూ తినాల్సినవి, తినకూడనివి తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో షుగర్ పేషెంట్లు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..
- డయాబెటిస్ పేషెంట్లు వేసవిలో సులువుగా జీర్ణమయ్యే స్నాక్స్ తీసుకోవడం మంచిది. మొలకెత్తిన గింజలతో పెరుగును కలిపి సలాడ్ చేసుకొని తినడంవల్ల తేలికగా జీర్ణమవుతుంది. ఎందుకంటే మొలకెత్తిన గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
- దోసకాయ ముక్కలను సలాడ్‌గా తీసుకోవడంవల్ల వేసవిలో వేడిగా ఉన్న శరీరం చల్లబడుతుంది. అలాగే దాహం కూడా తీరుతుంది. ఎందుకంటే దోసలో అధిక శాతం నీరే ఉంటుంది. అంతేగాక పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి.
- పెసరపప్పు కూడా షుగర్ పేషెంట్లకు వేసవిలో మంచి ఆహారం. ఎందుకంటే పెసరపప్పులో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే పెసరపప్పు తినడంవల్ల డయాబెటిస్‌తోపాటు కడుపులో మంట కూడా తగ్గిస్తుంది. పెసరపప్పుతో పెరుగును కలుపుకుని పలు వెరైటీల్లో స్నాక్స్ చేసుకుని తినొచ్చు.
- బెర్రీస్, నారింజ, కివీస్ లాంటి పండ్లను తీసుకోవడంవల్ల కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Diabetis
- Health news
- Snacks
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

