Healthy Mayonnaise Recipe : మనం తీసుకునే ప్రతి ఫాస్ట్‌ఫుడ్ ఐటెంలో మయనీస్ కొత్త ఫ్లేవర్‌ను యాడ్ చేస్తుంది. బర్గర్, పిజా, శాండ్విచ్, పాస్తా ఇలా ఏ ఫుడ్ ఐటెం అయినా మయనీస్ లేకుండా ఊహించలేం. ఫుడ్‌కు ఇది జోడించే మెత్తని ఫ్లేవర్ చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ నోరూరించేస్తుంది. మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్స్‌నూ మయనీస్లో డిప్ చేసి తీసుకుంటారు.
అయితే మయనీస్ను ఇంతలా ఇష్టపడినా అందులో ఉండే కొవ్వు ఆరోగ్యానికి ఏమంత మేలు చేయదు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించే వారు మయనీస్ను పక్కనపెట్టి ప్రత్యామ్నాయాలనూ అన్వేషిస్తుంటారు. మయనీస్లో ఎగ్స్, ఆయిల్ ఉండటంతో ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులే అయినా ఇందులో ఆరోగ్యానికి హానికరమైన సంతృప్త కొవ్వులూ ఉంటాయి.
ఇది క్యాలరీలను పెంచడంతో ఆరోగ్యానికి కొంత చేటు చేస్తుంది. మయనీస్ అతిగా తీసుకుంటే బరువు పెరగడం, హృద్రోగ సమస్యలు, మధుమేహం, బీపీ పెరుగుదల వంటివి తలెత్తుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ప్రత్యామ్నాయంగా రోస్టెడ్ రెడ్ బెల్‌పెప్పర్, పనీర్, బాదం, పెరుగు, వెల్లుల్లితో స్మూత్ పేస్ట్‌ను తయారుచేసుకుంటే మయనీస్ రుచిని పొందడంతో పాటు ఆరోగ్యకరమైన రీతిలో ఇష్టమైన పదార్ధాన్ని సిద్ధం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Read More :