Health Tips | శృంగారం అనే పేరులోనే ఏదో తెలియని అనుభూతి దాగి ఉంటుంది. శృంగారం ఇద్దరి మధ్య ప్రేమ పెంచుతుంది.. బంధాన్ని బలోపేతం చేస్తుంది. అలాంటి శృంగార జీవితాన్ని కోల్పోతున్నారా? అయితే మీరు ఈ చిట్కాలు పాటించి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. కొత్త అనుభూతిని పొందండి.
– ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. హార్మోన్లను సమతుల్యం చేసే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శృంగారంలో కొత్త అనుభూతిని పొందొచ్చు. విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలను మరిచిపోవద్దు. వాటిని కచ్చితంగా మన మెనూలో ఉంచుకోవాలి.
– ఆల్కహాల్, పొగ తాగే అలవాటు ఉంటే మానుకోవాలి. వీటి వల్ల దుష్ర్పభావాలు అధికంగా సంభవిస్తాయి. శృంగార శక్తిని కూడా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-ఇక మీకు ఇష్టమైన అంశాలను, కోరికలను మీ భాగస్వామితో ఓపెన్‌గా మాట్లాడండి. ఈ విషయంలో వెనుకడుగు వేయొద్దు. మీ వ్యక్తిగత అనుభూతులను కూడా భాగస్వామితో పంచుకోని, ఎంజాయ్ చేసేందుకు అవకాశాలను ఏర్పరుచుకోవాలి. మీకు ఇష్టమైనవి, ఇష్టం కానివి ఏవైనా వాటిని మనసులో పెట్టుకోకుండా, బహిర్గతం చేయండి. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇవన్నీ ఇద్దరు దంపతుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి.
– మహిళలకు ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని, మగవారు మెలిగితే.. వారి శృంగార జీవితం సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది.
– మీలో మీరే కుంగిపోవద్దు. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఏవైనా సమస్యలు ఉంటే భాగస్వామితో పంచుకోండి. అలా ఒకరికొకరు అన్ని విషయాలు చర్చించుకుంటూ ముందుకు వెళ్తే.. శృంగారం జీవితాన్ని సాఫీగా కొనసాగించొచ్చు.