మలబద్ధకం సమస్య వేధిస్తుందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Health Tips | జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై అధిక భారంపడి జీర్ణశక్తి తగ్గుతుంది. ఇది క్రమంగా
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై అధిక భారంపడి జీర్ణశక్తి తగ్గుతుంది. ఇది క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది. మలబద్ధకంవల్ల మలవిసర్జన సరిగా జరగక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే నొప్పి కూడా మొదలవుతుంది. తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. ఏ పనీ కుదురుగా చేయలేకపోతాం. మరి ఈ సమస్యను మీరు కూడా ఫేస్ చేస్తున్నారా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. దాంతో ఏ రోజుకు ఆ రోజుకు జీర్ణాశయం, పేగులు శుభ్రపడుతాయి. దాంతో మలబ్ధకం దరిచేరదు. రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఈ ఫైబర్ కంటెంట్ కోసం దోసకాయ, శనగ, పెసలు లాంటి గింజలు, యాపిల్స్, ఆకు కూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు
మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లకు ఉదయం పూట బాధ ఎక్కవుగా ఉంటుంది. లేవగానే మల విసర్జన జరగక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజూ ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసెడు గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల మీ పెద్దపేగు గోడల్లో కదలికలు సులభమవుతాయి. దీన్ని వైద్యపరిభాషలో గ్యాస్ట్రో-కోలిక్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. ఇది మలాన్ని బయటకు నెట్టేస్తుంది.
రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు
మన శరీరానికి రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు అవసరమవుతుంది. కావాల్సినన్ని నీళ్లు తీసుకోకపోతే శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. దానివల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణంకాక మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి. 300 మిల్లీలీటర్ల గ్లాసుతో రోజుకు కనీసం 12 గ్లాసులైనా నీళ్లు తీసుకోవాలి.
నిత్యం శారీరక వ్యాయామం
ఈ రోజుల్లో చాలామందివి సిట్టింగ్ కొలువులే. దానివల్ల ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తుంటారు. ఇలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. అందుకే పనిప్రదేశంలో గంటకు ఒకసారైనా లేచి కాసేపు నడవాలి. ఆహారం తీసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు నడిస్తే జీర్ణం సులువుగా జరుగుతుంది. దాంతో మలబ్ధకం సమస్య పారిపోతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

