హెల్త్ బిట్స్
ఏ మనిషి అయినా ప్రయోజనాన్ని ఆశించే పనిచేస్తాడు. మరి, ప్రయోజనం ఉంటేనే ఏదైనా.. అనే తత్వం ఎలా అలవడింది? అనే సందేహానికి ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు మూలాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. వారి పరిశీలన ప్రకారం మనిషి పుట్టిన తొలి నెలల్లోనే లక్ష్యం మేరకు పనిచేసే లక్షణం వృద్ధి చెందుతుందట.
ప్రయోజనం ఉంటేనే పని చేస్తాం
ఏ మనిషి అయినా ప్రయోజనాన్ని ఆశించే పనిచేస్తాడు. మరి, ప్రయోజనం ఉంటేనే ఏదైనా.. అనే తత్వం ఎలా అలవడింది? అనే సందేహానికి ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు మూలాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. వారి పరిశీలన ప్రకారం మనిషి పుట్టిన తొలి నెలల్లోనే లక్ష్యం మేరకు పనిచేసే లక్షణం వృద్ధి చెందుతుందట. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు పిల్లల కాళ్లకు కదిలే బొమ్మలను తాడుతో కట్టి ఉంచారు. బొమ్మల కదలిక ఎంత ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా అంత ఎక్కువగా కదలడం పరిశోధకులు గుర్తించారు. అలా, తనకు ఏదైనా కావాలనుకుంటేనే మనిషి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టడం శైశవ దశలోనే మొగ్గతొడుగుతుందని పరిశోధకులు గ్రహించారు.
బరువు తగ్గేందుకు బాదం
బరువు తగ్గే విషయానికి వచ్చేసరికి చాలామందిలో బాదం, జీడిపప్పు లాంటి గింజలపట్ల చెడు అభిప్రాయం నెలకొని ఉంది. వీటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, కొవ్వులు కూడా అధికమే కాబట్టి ఈ అభిప్రాయం ఏర్పడింది. అయితే, దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం పరిశోధకులు మాత్రం బాదం గింజలతో ఎంచక్కా బరువు తగ్గొచ్చు అంటున్నారు. ఆహారంలో బాదం గింజలను భాగం చేసుకుంటే బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యం మెరుగుపడినట్లు ఈ పరిశోధకులు గుర్తించారు.
అమెరికన్ పిల్లల గొప్ప డొల్లే!
లెక్కల సామర్థ్యం ఇతర దేశాలవారి కంటే తమకే ఎక్కువని అమెరికా టీనేజర్లు గొప్పలకు పోతారని ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికోసం పరిశోధకులు 9 ఇంగ్లిష్ మాట్లాడే దేశాలకు చెందిన 40,000 మంది 15 ఏండ్ల వయసు పిల్లల నుంచి సమాచారం సేకరించారు. ఇందులో ఇతర దేశాల కంటే లెక్కల్లో తామే ఘనులమని అమెరికన్లు తమ సామర్థ్యం గురించి చాలా ఎక్కువగా చెప్పుకొన్నారట. ఇక సర్వేలో భాగంగా పరిశోధకులు గణితంలో లేనివి అడిగినా కూడా అమెరికా పిల్లలు లేని గొప్పలకు పోయి అవన్నీ తమకు తెలిసినట్లుగా అత్యుత్సాహం ప్రదర్శించారట. దీంతో అమెరికన్ పిల్లలకు తమ గణిత పాటవం మీద అతివిశ్వాసం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

