పుదీనా తిందాం.. తేనె వేసుకుందాం!
చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా దవాఖానకు పరుగులు తీస్తుంటారు చాలామంది. సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదే! అయితే, ప్రతి చిన్న విషయానికీ మందులు వాడటం అంత మంచిది కాదనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి.
చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా దవాఖానకు పరుగులు తీస్తుంటారు చాలామంది. సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదే! అయితే, ప్రతి చిన్న విషయానికీ మందులు వాడటం అంత మంచిది కాదనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి. తరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయ చిట్కాలు పాటించి చిన్నాచితకా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఔషధాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవచ్చు.
- నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. ఎన్నిరకాల పేస్టులు వాడినా సమస్య పరిష్కారం కాదు. ప్రతి రోజూ నాలుగైదు పుదీనా ఆకులను తినడం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.
- రెండుమూడు రకాల మందులు వేసుకున్నా.. పడిశం ఓ పట్టాన లొంగదు. ఇలాంటప్పుడు మిరియాల చారు భేషుగ్గా పనిచేస్తుంది. పాలలో మిరియాల పొడి వేసుకొని తాగినా గుణం కనిపిస్తుంది. అంతేకాదు ఆహారంలో మిరియాల పొడి తీసుకోవడం అలవాటు చేసుకుంటే.. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్య కూడా దూరమవుతుంది.
- రక్తపోటు సమస్యకు సరైన వైద్యం తీసుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండాలంటే మునగాకు పొడి తరచూ తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ చిటికెడు మునగాకు పొడి తీసుకుంటే.. బీపీ కంట్రోల్లో ఉంటుంది.
- రక్తహీనత సమస్యకు తేనె చక్కని పరిష్కారం. చక్కెర వినియోగాన్ని తగ్గించి… టీ, కాఫీ, ఇతర ఆహార పదార్థాల్లో తేనెను ఉపయోగిస్తే రక్తహీనత నుంచి బయటపడొచ్చు.
- రక్తనాళాలు మందంగా ఉండి సమస్యలను ఎదుర్కొనే వాళ్లు బీట్రూట్ రసాన్ని రోజూ తాగితే మంచిది. అప్పుడు రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె సమస్యలు కూడా దరిచేరవు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

