Winter Fruit | వింటర్లో ఈ పండును అసలు మిస్ అవకండి..!
Winter Fruit : జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండే శీతాకాలంలో ఇమ్యూనిటీని బలోపేతం చేసుకోవాలంటే ఆరోగ్యకర ఆహారం అధికంగా తీసుకోవాలి. ఎన్నో సీజనల్ ఫ్రూట్స్ మన శరీరానికి మేలు చేస్తుండగా వాటిలో శీతాఫలం ముందువరసులో ఉంటుంది.
Winter Fruit : జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండే శీతాకాలంలో ఇమ్యూనిటీని బలోపేతం చేసుకోవాలంటే ఆరోగ్యకర ఆహారం అధికంగా తీసుకోవాలి. ఎన్నో సీజనల్ ఫ్రూట్స్ మన శరీరానికి మేలు చేస్తుండగా వాటిలో శీతాఫలం ముందువరసులో ఉంటుంది. ఈ స్వీట్ ఫ్రూట్ ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాల గనిగా వింటర్ డైట్లో అగ్రభాగాన నిలుస్తుంది. విటమిన్ సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే శీతాఫలాలు రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తాయి.
వీటిలో ఉండే ఏ విటమిన్లు, బీ6 గుండె, ఊపిరితిత్తులు మెరుగ్గా ఉండేందుకు కీలకం కాగా, కుంగుబాటు సమస్యల నుంచి బయటపడేందుకు కూడా ఈ పండులో ఉండే పదార్ధాలు ఉపకరిస్తాయి. శీతాఫలాల్లో ఉండే ఫైబర్‌తో మలబద్ధకం దూరమై జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఈ పండు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంతో చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా మెరుస్తుంది.
ఇక శీతాఫలాల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫెనోలిక్ కాంపౌండ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్, హృద్రోగం వంటి తీవ్ర అనారోగ్యాల ముప్పు తగ్గుతుంది. శీతాఫలాలు తరచూ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుందని డైటీషియన్ భావనా శర్మ చెప్పుకొచ్చారు. శీతాఫలాల్లో ఉండే పొటాషియంతో అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇక శీతాఫలాలతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు
కంటి ఆరోగ్యం మెరుగు
బీపీకి చెక్
జీర్ణక్రియ మెరుగుదల
ఆర్ధరైటిస్ నియంత్రణ
చర్మ సంరక్షణ
Read News :
Immunity Boosters | వంటింట్లో ఇన్ని దివ్యౌషధాలున్నాయా.. మీరూ ట్రై చేయండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

