Immunity Boosters | వంటింట్లో ఇన్ని దివ్యౌషధాలున్నాయా.. మీరూ ట్రై చేయండి!
Immunity Boosters | పూర్వీకులు ఇప్పట్లా ఫాస్ట్‌ఫుడ్ తినలేదు. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లలేదు. సుబ్బరంగా ఇంట్లో వండిన ఆహారాన్నే ఆస్వాదించేవారు. ఆ తయారీలో కూడా స్థానికంగా దొరికే కూరగాయలు, దినుసులే వాడేవారు.
Immunity Boosters | మన పెద్దవాళ్లు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. మరీ పెద్ద సమస్య అయితే తప్ప దవాఖానకు వెళ్లేవారు కాదు. ఇంజెక్షన్ అంటేనే తెలియదు. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నం. పోషకాహార సలహాలు మొదలు అన్నిటికీ డాక్టర్ల మీదనే ఆధారపడుతున్నారు. ఈ మార్పులకు కారణం ఏమిటి?
- ఓ పాఠకురాలు
పూర్వీకులు ఇప్పట్లా ఫాస్ట్‌ఫుడ్ తినలేదు. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లలేదు. సుబ్బరంగా ఇంట్లో వండిన ఆహారాన్నే ఆస్వాదించేవారు. ఆ తయారీలో కూడా స్థానికంగా దొరికే కూరగాయలు, దినుసులే వాడేవారు. అమ్మలూ, అమ్మమ్మలూ పూర్వకాలం నుంచీ వచ్చిన పద్ధతుల్లోనే వంటలు చేసేవారు. మనవాళ్లు వంటింట్లో ఉండితీరాలి అని చెప్పిన పదార్థాలకు ఎన్నో సుగుణాలున్నాయి. ఉదాహరణకు పోపులో వాడే ఇంగువ ఆహారానికి రుచిని అద్దడమే కాదు, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. అలాగే వంటల్లో జోడించే అల్లం జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. పైత్యాన్ని, కీళ్ల నొప్పుల్నీ తగ్గిస్తుంది. వెల్లుల్లిలో క్యాన్సర్‌ను నివారించే సుగుణాలున్నాయి.
హైబీపీని నియంత్రించడంలోనూ పనికొస్తుంది. దాల్చిన చెక్క కూడా వాపుల్ని తగ్గించే స్వభావం ఉన్నదే. షుగర్ నియంత్రణలోనూ ఇది సహకరిస్తుంది. అంతెందుకు, వాసన కోసం వేసుకునే బిర్యానీ ఆకు జలుబు ఉపశమనానికి ఉపకరిస్తుంది. ఇందులో ఉండే సీనియోల్… సైనసైటిస్ వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. పుదీనా ఆకు శ్వాసను తాజాగా ఉంచడమే కాదు, ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్‌ను తగ్గించడంలోనూ తోడ్పడు తుంది. ఇవేనా? పసుపు, మిరియాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు.. ఇలా మన వంటింట్లోని ప్రతి దినుసూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదే. ఏది ఎంత మోతాదులో వేయాలో కూడా వాళ్లకు తెలుసు. కాబట్టే, ఆరోగ్యకరమైన వంటల రూపంలో వాటిని అందించారు పూర్వీకులు. మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

