నొప్పుల కుంపటి
తలనొప్పి ఎవరికైనా సహజమే. దాదాపు 48.9 శాతం మందిలో తలెత్తే నాడీ సంబంధ రుగ్మత ఇది. అయితే, పార్శపునొప్పి (మైగ్రెయిన్) తీవ్రమైన తలనొప్పితో కలిసి దాడిచేస్తుంది. రెండిటి తీవ్రత వేరువేరు అయినా.. దేన్నీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.
తలనొప్పి ఎవరికైనా సహజమే. దాదాపు 48.9 శాతం మందిలో తలెత్తే నాడీ సంబంధ రుగ్మత ఇది. అయితే, పార్శపునొప్పి (మైగ్రెయిన్) తీవ్రమైన తలనొప్పితో కలిసి దాడిచేస్తుంది. రెండిటి తీవ్రత వేరువేరు అయినా.. దేన్నీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.
పార్శపునొప్పితో బాధపడేవారు తీవ్రమైన తలనొప్పితోపాటు కింది లక్షణాలనూ కలిగి ఉంటారు.
- వాంతికి వచ్చినట్టు అనిపించడం, వికారం (నాజియా)
- తలతిప్పడం, కండ్లు తిరగడం.
- విపరీతమైన అలసట.
హార్మోన్లలో మార్పులు, అలర్జీలు, జన్యువులు, కుటుంబ చరిత్ర.. ఇలా పార్శపునొప్పికి కారణాలు అనేకం. వాతావరణంలో మార్పు, ఒత్తిడి, ఆహారం, ఘాటైన వాసనలు, నిద్రలేమి కూడా మైగ్రెయిన్‌కు దారితీస్తాయి.
ఏ వయసులో?
పార్శపునొప్పి ఏ వయసు వారినైనా బాధించవచ్చు. కాకపోతే, కౌమారంలో దీని ప్రభావం ఎక్కువ. మూడు
పదుల దశలో మరీ అధికం. ఆ తర్వాత వయసు పెరిగేకొద్దీ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది. తల్లిదండ్రులలో ఏ ఒక్కరు పార్శపునొప్పితో బాధపడుతున్నా.. సంతానానికి వచ్చే ఆస్కారం సగానికి సగం. అదే ఇద్దరికీ ఉంటే 90 శాతం వరకూ అవకాశం ఉంది.
నివారణ
పార్శపునొప్పి, తలనొప్పి నియంత్రణకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
లైట్లు ఆర్పేయాలి: వెలుతురు, చప్పుళ్లు పార్శపునొప్పిని పెంచుతాయి. కాబట్టి చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవాలి.
ఉష్ణ చికిత్స: హాట్ ప్యాక్స్, హీటింగ్ ప్యాడ్స్‌ను తలమీద ఉంచుకోవడం వల్ల ఒత్తిడికి గురైన కండరాలు ఉపశమనం పొందుతాయి. వేడినీటి స్నానం, షవర్ కూడా ఎంతోకొంత హాయినిస్తాయి.
కెఫీన్ పానీయాలు: పార్శపునొప్పి తొలిదశలో ఉన్నప్పుడు కెఫీన్ (టీ, కాఫీలు) కొంతమేర ఓదార్పునిస్తుంది. అంతేకాదు ఎసిటామినోఫెన్, యాస్పిరిన్ లాంటి ఔషధాల బాధా నివారణ శక్తిని కెఫీన్ మరింత పెంచుతుంది.
వేళకు నిద్ర: నిర్ణీత వేళల్లో నిద్రించడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. రోజూ కుదరకపోతే కనీసం
వారాంతంలో అయినా అమలు చేయాలి. పగటి కునుకు 20-30 నిమిషాలకు మించితే రాత్రిళ్లు నిద్ర పట్టదు.
ఇవి తినొద్దు: ఫలానా ఆహారం పార్శపునొప్పిని కలిగిస్తుందనే అనుమానం కలిగితే, తక్షణం దాన్ని పళ్లెం నుంచి తప్పించండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో గమనించండి.
ఒత్తిడికి దూరం: రోజువారీ జీవితంలో ఎక్కువ పనులు పెట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన సూచన.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

