Bad cholesterol | శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందా..? ఇలా తెలుసుకోండి..!
Bad cholesterol | శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితేనే మన ఆరోగ్యానికి ప్రమాదం. అయితే, ముందస్తుగా కొలెస్ట్రాల్ పెరగడాన్ని గుర్తించితే ఎన్నో రోగాలకు అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.
Bad cholesterol | కొలెస్ట్రాల్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. మంచి కొలెస్ట్రాల్ కూడా మన శరీరంలో ఉంటుంది. అయితే, ప్రాబ్లమ్స్ అన్నీ చెడు కొలెస్ట్రాల్‌తోనే. చెడు కొలెస్ట్రాల్‌నే ఎల్డీఎల్ అని కూడా పిలుస్తారు. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనపక్షంలో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నదని ఎలా గుర్తించాలి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? అనేది తెలుసుకుంటే మన ఆరోగ్యానికి ఢోకా ఉండదంటున్నారు నిపుణులు.
ఇలా గుర్తించాలి..
రక్తం సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి.
అధిక రక్తపోటు తలెత్తుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.
ఛాతీ భాగంలో నొప్పిగా ఉంటుంది.
కొన్నిసార్లు కాళ్లు, చేతులు, పాదాలపై పసుపు, ఎరుపురంగులో కురుపులు వస్తాయి.
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు కనిపిస్తాయి.
విపరీతమైన ఆయాసం ఉంటుంది.
వికారం కూడా కలుగుతుంది.
ఇవీ కారణాలు..
చెడు ఆహారపు అలవాట్లు ఉండటం వల్ల
ఊబకాయం కారణంగా
మద్యం, సిగరెట్ స్మోకింగ్ అలవాటు
వీటిని తినండి..
డార్క్ చాక్లెట్స్ మంచివి.
అవకాడోలు తింటూ ఉండాలి.
గ్రీన్ టీ, బ్లాక్ టీ తీసుకోవాలి.
ఆలివ్ ఆయిల్‌ను వాడుతుండాలి.
తృణధాన్యాలు తినాలి.
ఓట్స్, బార్లీ, సోయా బీన్స్ చాలా మంచివి.
యాపిల్, నారింజ, నిమ్మ పండ్లు తీసుకోవాలి.
బాదం, వెన్న, పసుపు వంటల్లో వాడుకోవాలి.
వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం శ్రేయస్కరం.
పసుపు పాలు తాగి అదుపులో ఉంచుకోవచ్చు.
చివరగా..
11 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ప్రతి ఐదేండ్లకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా 45 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల పురుషులు, 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు.. ప్రతి రెండేండ్లకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎన్నో రోగాలకు ముందుగానే అడ్డుకట్ట వేయవచ్చు.!
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

