జిమ్ సప్లిమెంట్స్ అతిగా వాడి ప్రాణాలపైకి తెచ్చుకున్న యువకుడు
తీరైన దేహాకృతి, సిక్స్ ప్యాక్‌ల కోసం యువత విచ్చలవిడిగా ప్రొటీన్ పౌడర్, జిమ్ సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడటం పెరిగిపోయింది.
న్యూఢిల్లీ : తీరైన దేహాకృతి, సిక్స్ ప్యాక్‌ల కోసం యువత విచ్చలవిడిగా ప్రొటీన్ పౌడర్, జిమ్ సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడటం పెరిగిపోయింది. జిమ్ సప్లిమెంట్స్‌ను అధికంగా వాడిన తర్వాత 22 ఏండ్ల యువకుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ప్రొటీన్ పౌడర్, జిమ్ సప్లిమెంట్స్‌ను అధికంగా వాడిన హిస్టరీ కలిగిన యువకుడి ఆరోగ్య పరిస్ధితి క్షీణించడంతో సౌత్ ఢిల్లీలోని పీఎస్ఆర్ఐ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డ్‌లో చేర్చారు. ఆక్సిజన్ లెవెల్స్ గణనీయంగా పడిపోవడంతో అతడిని ఐసీయూకు తరలించారు. చికిత్స అనంతరం పరిస్ధితి కుదుటపడటంతో అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
రోగి శరీరంలో క్రియాటిన్ ఫాస్పోకినేస్ వంటి మజిల్ ఎంజైమ్స్ అధికంగా ఉండటంతో పాటు పలుమార్లు తీవ్ర మెటబాలిక్ డిరెంజ్మెంట్కు గురయ్యాడని ఫలితంగా కండర కణజాలం బ్రేక్‌డౌన్‌కు దారితీసిందని వైద్యులు తెలిపారు. ఆపై రోగి క్యాల్షియం లెవెల్స్ కూడా తగ్గడంతో అతడి పరిస్ధితి క్షీణించిందని చెప్పారు. రోగికి టాక్సిక్ ఎన్సెఫలోపతి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇది మెదడు పనిచేయకపోవడం వల్ల తలెత్తే ప్రాణాంతకమైన పరిస్థితని ఇది శాశ్వత వైకల్యానికి కూడా దారితీయవచ్చని వైద్యులు తెలిపారు.
రోగి తీవ్రంగా కండరాల విచ్ఛిన్నానికి గురయ్యే అవకాశం ఉందని దీని ఫలితంగా కాల్షియం స్థాయిలు తగ్గుతాయని వైద్యులు తెలిపారు. పర్యవసానంగా, ఇది మూర్ఛతో పాటు స్పృహ కోల్పోవడానికి కారణమవుతుందని చెప్పారు. అధికంగా జిమ్ సప్లిమెంట్స్ వాడితే తలనొప్పి, యాంగ్జైటీ, ఛాతీనొప్పి, అధిక రక్తపోటు, తిమ్మిర్లు వంటి సైడ్ ఎఫెక్ట్స్ బాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జిమ్ సప్లిమెంట్స్, ప్రొటీన్ పౌడర్ అధికంగా వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరాన్‌పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

