Green Tea | షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేసే గ్రీన్ టీ.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..
గ్రీన్ టీని చాలామంది కేవలం బరువు తగ్గించే పానీయంగా మాత్రమే భావిస్తారు. కానీ అంతకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను గ్రీన్ టీ కలిగి ఉంది. గ్రీన్ టీ లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ ముఖ్యంగా కాటెకిన్స్ శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Green Tea | గ్రీన్ టీని చాలామంది కేవలం బరువు తగ్గించే పానీయంగా మాత్రమే భావిస్తారు. కానీ అంతకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను గ్రీన్ టీ కలిగి ఉంది. గ్రీన్ టీ లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ ముఖ్యంగా కాటెకిన్స్ శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే L-థియానిన్ కారణంగా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చక్కెర కలిపిన టీకి బదులుగా గ్రీన్ టీని తీసుకోవడం డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపికగా భావిస్తున్నారు. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలా ప్రభావం చూపుతుందో పరిశోధనలు వివరిస్తున్నాయి. మానవ పరీక్షలు, మెటా-అనాలిసిస్‌ల ఆధారంగా గ్రీన్ టీ గ్లూకోజ్ నియంత్రణకు పలు విధాలుగా సహాయపడుతుందని తేలింది.
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు..
గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఈజీసీజీ (EGCG) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలు ఇన్సులిన్‌ను సమర్థంగా ఉపయోగించుకునేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతాయి. ఇంకా గ్రీన్ టీ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తుంది. కాటెకిన్స్ కారణంగా ఆహారం తీసుకున్న తర్వాత చక్కెర రక్తంలోకి వేగంగా ప్రవేశించకుండా నిరోధించబడుతుంది. దీంతో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం తగ్గుతుంది. ఇది మాత్రమే కాదు, గ్రీన్ టీ శరీరంలోని మాక్రోఫేజ్ కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి మెటబాలిజం ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కణాల పనితీరు మెరుగుపడితే గ్లూకోజ్ సమతుల్యత కూడా మెరుగుపడుతుంది. అలాగే గ్రీన్ టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక వాపు (ఇన్ఫ్లమేషన్) ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణమవుతుంది. గ్రీన్ టీ వాడకం వల్ల ఈ వాపు తగ్గి ఇన్సులిన్ వినియోగం మెరుగుపడుతుంది.
HbA1c స్థాయిలు కూడా..
పరిశోధనల ప్రకారం గ్రీన్ టీ వాడకం ఫాస్టింగ్ చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే HbA1c స్థాయిలు కూడా తగ్గుతాయని గుర్తించారు. ఇవి దీర్ఘకాలికంగా చక్కెర నియంత్రణకు కీలక సూచికలు. బరువు నియంత్రణలో కూడా గ్రీన్ టీ కొంతవరకు సహాయపడుతుంది. మెటబాలిజాన్ని స్వల్పంగా పెంచడం, కొవ్వు కరిగే ప్రక్రియను ప్రోత్సహించడం ద్వారా ఇది టైప్-2 డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే గ్రీన్ టీ వాడకంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు అవసరం..
చక్కెర కలిపిన గ్రీన్ టీ తీసుకుంటే దాని ప్రయోజనాలు తగ్గిపోతాయి. కొంతమందిలో ఇందులో ఉన్న కెఫీన్ కారణంగా చక్కెర స్థాయిలు తాత్కాలికంగా పెరగవచ్చు లేదా నిద్రలో అంతరాయం కలగవచ్చు. కొన్ని మందులతో (బ్లడ్ థిన్నర్స్, బీటా బ్లాకర్స్) ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఐరన్ శోషణపై కూడా ప్రభావం చూపవచ్చు. రోజుకు 3-4 కప్పుల వరకు గ్రీన్ టీ తీసుకోవడం సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా చక్కెర లేదా స్వీటెనర్లు కలపకుండా తాగడం ఉత్తమం. గ్రీన్ టీ రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయకంగా ఉంటుంది. కానీ ఇది పూర్తి చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. సమతుల్య ఆహారం, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- green tea
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

