బ్రెడ్‌కు జామ్ రాసుకుని తింటున్నారా?.. తినే ఆహారాన్ని బట్టే గ్యాస్ ట్రబుల్ వస్తుంది..!
ఆహారం, జీర్ణ వ్యవస్థ రెండిటినీ విడదీయలేం. గ్యాస్ సమస్య మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాల కలయిక కూడా ఈ ఇబ్బందిని అధికం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
ఆహారం, జీర్ణ వ్యవస్థ రెండిటినీ విడదీయలేం. గ్యాస్ సమస్య మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాల కలయిక కూడా ఈ ఇబ్బందిని అధికం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
- అన్నం తినగానే పళ్లు తోముకోవడం చాలామందికి అలవాటు. నిజానికి, నీళ్లతో బాగా పుక్కిలించి ఉమ్మితే సరిపోతుంది. ఎందుకంటే, టూత్‌పేస్ట్‌లోని రసాయనాలు కొందరికి కడుపుబ్బరం కలిగిస్తాయి.
- అరటిపండు వరకూ ఫర్వాలేదు కానీ, పీచు ఎక్కువగా ఉండే పళ్లు జీర్ణక్రియను నిదానిస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, కడుపుబ్బరం ఇబ్బంది పెట్టవచ్చు.
- పాలల్లో బ్రెడ్ ముంచుకోవడం, చపాతీని చాయ్‌లో నంజుకోవడం చాలామందికి అలవాటు. మైదా, గోధుమ లాంటి పదార్థాలు అరిగేందుకు చాలా సమయం తీసుకుంటాయి. అదే సమయంలో పాల పదార్థాలూ నిదానంగా అరుగుతాయి. ఈ రెండూ కలిస్తే జీర్ణవ్యవస్థ మీద అదనపు భారమే!
- నేరుగా బ్రెడ్ తినలేరు పిల్లలు. జామ్, పీనట్ బటర్ లాంటివి రాయాల్సిందే. బ్రెడ్ అరగడమే కష్టం. జామ్ లాంటి పదార్థాలలోని అధిక చక్కెర తోడైతే అజీర్తి తప్పనట్టే!
- మాంసం, ఆలుగడ్డ కలయిక రుచికరమే. కానీ మాంసంలోని ప్రొటీన్లు, దుంపల్లోని కార్బొహైడ్రేట్లు ఒకేసారి కడుపులో పడితే అజీర్తి తప్పదు. గ్యాస్ ఏర్పడుతుంది.
ఇవే కాదు. గోధుమ-పండ్లు, బీన్స్-చీజ్… లాంటి కాంబినేషన్ల్లూ ఇబ్బంది కలిగిస్తాయి. ఏం తిన్నాక గ్యాస్ సమస్య పెరుగుతుందో గమనించుకుని.. ఆ కలయికను మార్చి చూడటం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

