శ్రమకు తగిన నిద్ర
మెదడు పనితీరుపై వయసు ప్రభావం అపారం. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపుతోపాటు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే వేగం తగ్గిపోతాయి. పెరిగే వయసుతోనే కాదు, తగ్గే నిద్రతోనూ సమస్య తీవ్రం అవుతుందని పరిశోధకులు గుర్తించారు.
మెదడు పనితీరుపై వయసు ప్రభావం అపారం. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపుతోపాటు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే వేగం తగ్గిపోతాయి. పెరిగే వయసుతోనే కాదు, తగ్గే నిద్రతోనూ సమస్య తీవ్రం అవుతుందని పరిశోధకులు గుర్తించారు. వయసుతోపాటు వచ్చే సమస్యలను వ్యాయామం ద్వారా వాయిదా వేయవచ్చని ఇప్పటి వరకూ భావించారు. ఇందులో కొంత నిజం ఉంది. కానీ, వ్యాయామానికి తగ్గట్టు నిద్రపోతేనే ఆశించిన ఫలితాలను అందుకోగలరు. లేకపోతే శ్రమంతా వృథాయే అని నిర్ధారిస్తూ లాన్సట్ జర్నల్ ఒక పరిశోధనా ఫలితాన్ని ప్రచురించింది.
యాభై ఏండ్లు పైబడిన 8,958 మందిపై పదేండ్లపాటు నిర్వహించిన పరిశోధనలో.. మెదడు పనితీరుకు సంబంధించిన అనేక మార్పులను గుర్తించారు పరిశోధకులు. శారీరక శ్రమ (వ్యాయామాలు) చేసేవాళ్లు తగినంత నిద్రపోయినప్పుడు వాళ్ల మెదడు పనితీరు (జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే వేగం) చురుకుగా ఉన్నట్టు గుర్తించారు. ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో మాత్రం మతిమరుపు పెరిగింది, నేర్చుకునే సామర్థ్యాన్నీ కోల్పోయారు. ఎన్ని కసరత్తులు చేసినా శరీరానికి నిద్ర కూడా ముఖ్యమేనని ఈ పరిశోధన రుజువు చేస్తున్నది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

