Skincare Routine | రాత్రి పూట ఈ సూచనలు పాటిస్తే.. మీ చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది..
ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించే చర్మం కోసం కేవలం పగటి సమయంలో వాడే స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే కాదు, రాత్రి చేసే సంరక్షణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రపోతున్న సమయంలో చర్మం సహజంగానే రిపేర్, రీజనరేషన్ ప్రక్రియలోకి వెళ్తుంది. అందుకే ఆ సమయంలో సరైన సంరక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
Skincare Routine | ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించే చర్మం కోసం కేవలం పగటి సమయంలో వాడే స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే కాదు, రాత్రి చేసే సంరక్షణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రపోతున్న సమయంలో చర్మం సహజంగానే రిపేర్, రీజనరేషన్ ప్రక్రియలోకి వెళ్తుంది. అందుకే ఆ సమయంలో సరైన సంరక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మంచి ఫలితాల కోసం 10 స్టెప్స్ ఉన్న క్లిష్టమైన రొటీన్ అవసరం లేదు. సరళమైన, నిరంతరంగా పాటించే రాత్రి రొటీన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్లీన్ చేయడం, ట్రీట్ చేయడం, మాయిశ్చరైజ్ చేయడం ద్వారా చర్మానికి అవసరమైన ప్రాథమిక సంరక్షణ అందుతుందని చర్మ వైద్యులు సూచిస్తున్నారు.
రాత్రిపూట క్లీన్సెంగ్ ముఖ్యం..
మొదటి స్టెప్ క్లీన్సెంగ్. రోజంతా పేరుకున్న మేకప్, సన్‌స్క్రీన్, దుమ్ము, కాలుష్యాన్ని తొలగించడం అత్యవసరం. దీనికి డబుల్ క్లీన్సెంగ్ విధానం ఉపయోగపడుతుంది. ముందుగా ఆయిల్-బేస్డ్ క్లీన్సర్ లేదా బామ్‌తో మేకప్, సన్‌స్క్రీన్‌ను కరిగించి, తర్వాత మైల్డ్ వాటర్-బేస్డ్ క్లీన్సర్తో మిగిలిన మలినాలను తొలగించాలి. రాత్రి క్లీన్సెంగ్ ఉదయానికంటే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రెండో స్టెప్ ట్రీట్. చర్మ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రోజుకు ఒక యాక్టివ్ ఇంగ్రిడియెంట్ను మాత్రమే వాడాలి. రెటినాయిడ్, AHA లేదా హయాలురోనిక్ యాసిడ్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకుని వాడటం మంచిది. ఇవన్నీ ఒకేసారి వాడకూడదు. చర్మ రక్షణను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తూ వాడాలి.
మాయిశ్చరైజర్ వాడాలి..
మూడో స్టెప్ మాయిశ్చరైజర్. చివరగా మంచి మాయిశ్చరైజర్‌తో చర్మాన్ని సీల్ చేయాలి. సెరమైడ్స్, పాంతెనాల్ లేదా స్క్వాలీన్ వంటి పదార్థాలు ఉన్న క్రీమ్ ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా, స్కిన్ బ్యారియర్‌ను రిపేర్ చేసి, నీటి ఆవిరీభవనాన్ని తగ్గిస్తుంది. ముఖం, మెడపై సరిపడా మోతాదులో రాత్రి క్రీమ్ రాయడం వల్ల ఉదయం నిద్రలేచినప్పుడు చర్మం మెత్తగా, హైడ్రేటెడ్‌గా కనిపిస్తుంది. ఈ మూడు సులభమైన స్టెప్స్‌ను క్రమంగా పాటిస్తే, చర్మం సహజంగా రాత్రి జరిగే రిపేర్ ప్రక్రియకు మద్దతు లభిస్తుంది. మీరు ఇచ్చే సంరక్షణకు అనుగుణంగా ఫలితాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

