Thyroid | థైరాయిడ్‌తో బాధపడుతున్నారా.. అయితే మీకు ప్రశాంతతే మొదటి ఔషధం
బరువులో హెచ్చుతగ్గులు, కుంగుబాటు, జుట్టు రాలడం, ఇవన్నీ థైరాయిడ్ లోపంతో వచ్చే సమస్యలు. అయోడిన్ లోపంతోపాటు జన్యువులు కూడా థైరాయిడ్ సమస్యకు కారణం అవుతాయి.
Thyroid | బరువులో హెచ్చుతగ్గులు, కుంగుబాటు, జుట్టు రాలడం, ఇవన్నీ థైరాయిడ్ లోపంతో వచ్చే సమస్యలు. అయోడిన్ లోపంతోపాటు జన్యువులు కూడా థైరాయిడ్ సమస్యకు కారణం అవుతాయి. పదిమంది మహిళల్లో నలుగురు తమ జీవితకాలంలో థైరాయిడ్ సమస్య బారినపడతారు అని ఓ అంచనా! ఈ సమస్య ఎదురైతే ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి వల్ల హార్మోన్ అసమతుల్యం ఏర్పడి, థైరాయిడ్ హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునే
ప్రయత్నం చేయాలి.
జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియాను కాపాడుకోవాలి. పీచు పదార్థాలు తినడం, పెరుగు లాంటి ప్రోబయాటిక్స్ తీసుకోవడం, తీపికి దూరంగా ఉండటం వల్ల పొట్టలో బ్యాక్టీరియా బాగుండి థైరాయిడ్ దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది.
ప్రొటీన్స్ అధికమోతాదులో ఉండే ఆహారం తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ కణాలకు అందుతుంది. ఇందుకోసం గుడ్లు, చేపలు, సోయామిల్క్ లాంటివి తీసుకోవచ్చు.
పొగతాగడం వల్ల థైరాయిడ్ సమస్యతోపాటు దాని దుష్ఫలితాలు కూడా పెరుగుతాయి.
క్యాబేజి, క్యాలిఫ్లవర్, పాలకూర, సోయాబీన్స్, వేరుశనగలాంటి కొన్ని పదార్థాలను గాయిట్రోజన్స్ అంటారు. ఇవి అయోడిన్ శరీరానికి అందకుండా చేస్తాయి. ఫలితంగా థైరాయిడ్ సమస్య పెరగవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

