శాకాహారులకు హెచ్చరిక.. నాన్ వెజిటేరియన్ల కంటే వీరికే ముప్పు ఎక్కువ

‘మాంసాహారుల్లోనే కొవ్వు ఎక్కువ’ తరచూ వినిపించే మాట ఇది. కానీ, శాకాహారులే ఎక్కువ కొవ్వు వినియోగిస్తారని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) విశ్లేషణలో తేలింది. శాకాహారుల్లోనే కొవ్వు నిల్వలు అధికమని వెల్లడించింది. ఎన్ఐఎన్ పరిశోధకులు ‘ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఇండియా 2019’ కోసం న్యూట్రిషనల్ డాటాను విశ్లేషించారు. 7 మెట్రో నగరాలు హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి ప్రజల విజిబుల్ ఫ్యాట్ (నూనె, వెన్న, నెయ్యి, కొవ్వు వంటివి) వినియోగంపై అధ్యయనం చేశారు. అసెస్మెంట్ ఆఫ్ విజిబుల్ ఫ్యాట్ కన్సంప్షన్ అనే నివేదికను తయారుచేశారు. మాంసాహారుల కంటే శాకాహారులే కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నట్టు తేల్చారు. శాకాహారులు రోజుకు సగటున 40.4 గ్రాముల విజిబుల్ ఫ్యాట్ తీసుకుంటుండగా.. మాంసాహారులు 30.1 గ్రాములే వినియోగిస్తున్నారని వెల్లడించారు. కనిపించే కొవ్వు.. శాకాహారులు తరచూ తినే తెల్ల బియ్యం, పరోటా వంటి ఆహార పదార్థాల్లో వినియోగించే నూనెల్లో ఎక్కువ ఉంటుందని గుర్తించారు. ఏడు మహానగరాల్లో హైదరాబాద్‌లోనే తక్కువ విజిబుల్ ఫ్యాట్ వినియోగిస్తున్నట్టు తేల్చారు.
ఎన్ఐఎన్ విశ్లేషణ ప్రకారం..

- 40.4 గ్రాములు: ఏడు మహానగరాల్లో శాకాహారులు రోజుకు సగటున తీసుకుంటున్న విజిబుల్ ఫ్యాట్
- 30.1 గ్రాములు: మాంసాహారులు రోజుకు సగటున తీసుకుంటున్న విజిబుల్ ఫ్యాట్
- 25 గ్రాములు: హైదరాబాద్‌లో ప్రజలు రోజుకు సగటున వినియోగిస్తున్న విజిబుల్ ఫ్యాట్. ఏడు మహానగరాల్లో ఇదే తక్కువ
- ఏడు మెట్రో సిటీల్లో నిరక్షరాస్యుల్లో కంటే అక్షరాస్యుల్లోనే విజిబుల్ ఫ్యాట్ వినియోగం ఎక్కువ
- ఏడు మెట్రో సిటీల్లోని పట్టణ జనాభాలో రోజువారీ విజిబుల్ ఫ్యాట్ వినియోగం సగటున 33 గ్రాములుగా ఉన్నది. ఐసీఎమ్మార్ సిఫారసు చేసింది 22 గ్రాములే.
- మొత్తం ఎనర్జీలో 18 శాతం విజిబుల్ ఫ్యాట్ నుంచే లభిస్తుందని తెలుస్తున్నది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

