Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
క్యాన్సర్ నివారణ అంటే పొగతాగడం మానేయడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండడం మాత్రమే కాదు. కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతాయని తాజా విశ్లేషణ వెల్లడించింది.
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగతాగడం మానేయడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండడం మాత్రమే కాదు. కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతాయని తాజా విశ్లేషణ వెల్లడించింది. ది లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితమైన విశ్లేషణ ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 23 లక్షల కేసులు ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయి. అంటే ప్రతి ఎనిమిది క్యాన్సర్ కేసుల్లో ఒకటి ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉన్నట్లు అంచనా. భారత్‌లోనూ వైరస్లు, బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్ల కారణంగా సుమారు 1.9 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైనట్లు ఈ విశ్లేషణ పేర్కొంది. అయితే ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని దీని అర్థం కాదు.
ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలం ఉంటే..
కొన్ని ఇన్ఫెక్షన్లు శరీరంలో దీర్ఘకాలం కొనసాగితే కణాలు, కణజాలాల్లో పదేపదే వాపు ఏర్పడటం, దెబ్బతినడం వంటి మార్పులు సంభవిస్తాయి. కాలక్రమేణా ఇవి కణాల్లో అసాధారణ మార్పులకు దారితీసి క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ), హెలికోబాక్టర్ పైలోరి (హెచ్ పైలోరి) బ్యాక్టీరియా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లు, ఎప్స్టీన్ బార్ వైరస్ వంటి ఐదు రకాల ఇన్ఫెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న క్యాన్సర్ కేసుల్లో అధిక భాగానికి కారణమవుతున్నాయి. ఇన్ఫెక్షన్ రకం, అది శరీరంలో ఎంతకాలం కొనసాగుతోంది, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, జీవనశైలి, జన్యుపరమైన అంశాలను బట్టి క్యాన్సర్ ముప్పు మారుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్తో..
హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం కొనసాగితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే మలద్వారం, పురుషాంగం, యోని, బాహ్య జననేంద్రియాలు, గొంతు ప్రాంతాల్లో వచ్చే కొన్ని క్యాన్సర్లతోనూ ఈ వైరస్‌కు సంబంధం ఉంటుంది. హెచ్‌పీవీ టీకా తీసుకోవడం, గర్భాశయ ముఖద్వార పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ తరహా క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు. మరోవైపు, హెచ్ పైలోరి బ్యాక్టీరియా జీర్ణాశయంలోని లోపలి పొరలో దీర్ఘకాలిక వాపును కలిగించి జీర్ఱాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాక్టీరియాతో సంబంధం ఉన్న క్యాన్సర్ కేసులు సుమారు 7.6 లక్షలుగా నమోదైనట్లు విశ్లేషణ అంచనా వేసింది. అలాగే హెపటైటిస్ బి, సి వైరస్ల వల్ల కాలేయం దీర్ఘకాలం దెబ్బతిని కాలేయ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. హెపటైటిస్ బికి టీకా అందుబాటులో ఉండగా, హెపటైటిస్ సికి టీకా లేదు. అయితే సమర్థవంతమైన యాంటీవైరల్ మందులతో హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ను చాలావరకు పూర్తిగా నయం చేయవచ్చు.
క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే..
కొన్ని ఇన్ఫెక్షన్లను నివారించడం, ముందుగానే గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం హెచ్‌పీవీ, హెపటైటిస్ బి టీకాలను వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి. హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉన్నవారు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సూదులను సురక్షితంగా ఉపయోగించడం, రక్తమార్పిడి సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించడం, లైంగిక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అడ్డుకోవచ్చు. హెచ్ పైలోరి వంటి ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. వీటితో పాటు పొగాకు వాడకానికి దూరంగా ఉండడం, మద్యపానాన్ని పరిమితం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం కూడా క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

