Health Tips | ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్ ఇదే!
అలసటను మటుమాయం చేసి తక్షణ శక్తినిచ్చే ఆరోగ్యకర ఆహారంగా సాబుదానా (సగ్గుబియ్యం) కిచిడీ ముందువరుసలో నిలుస్తుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివెకర్ చెబుతున్నారు.
న్యూఢిల్లీ : అలసటను మటుమాయం చేసి తక్షణ శక్తినిచ్చే ఆరోగ్యకర ఆహారంగా సాబుదానా (సగ్గుబియ్యం) కిచిడీ ముందువరుసలో నిలుస్తుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివెకర్ చెబుతున్నారు. మన వంటకాలు, సంస్కృతిలో సాబుదానా కిచిడీ ఓ భాగమని అంటారామె. ప్రముఖ ఫాస్టింగ్ డిష్ నుంచి ఆరోగ్యకర స్నాక్‌గా సాబుదానా మన వంటింట్లో పేరొందింది. ఈ వంటకం రుచికరమైనదే కాకుండా ఎంతో ఆరోగ్యకరమని రుజుత వివరించారు.
సాబుదానాను పల్లీలు, కూరగాయ ముక్కలు, జీలకర్ర, మిర్చి వంటి పదార్ధాలతో తీసుకుంటే మేలని చెబుతున్నారు. సాబుదానా కిచిడీ వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. సాబుదానాలో కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఇది ఎముకల పటిష్టానికి, కండరాల బలోపేతానికి ఉపయోగకరంగా ఉంటుంది. గ్లూటెన్ రహితంగా ఉండే సాబుదానాను గ్లూటెన్ పడని వారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
ఇక సాబుదానాలో అత్యధిక ఫైబర్ ఉండటం మూలంగా మధుమేహ నియంత్రణ, ఆహారం సులభంగా జీర్ణమవడం మెరుగైన ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఇక బరువు పెరగాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది. క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నా కొవ్వు తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాబుదానా రోజంతా అలసట లేకుండా పనిచేసే శక్తిని ఇస్తుండటంతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని తీసుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Food
- health tips
- Nutrition
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

