నేస్తమా.. ఆస్తమాతో జాగ్రత్త!
ఉబ్బస వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయాసానికి గురిచేస్తుంది. ఆస్తమాకు అనేక కారణాలు. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు, పర్యావరణ ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ధూమపానం తదితర దురలవాట్లు కూడా ఆస్తమాకు దగ్గర చేస్తాయి.
- నేడు ఆస్తమా డే
ఉబ్బస వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయాసానికి గురిచేస్తుంది. ఆస్తమాకు అనేక కారణాలు. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు, పర్యావరణ ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ధూమపానం తదితర దురలవాట్లు కూడా ఆస్తమాకు దగ్గర చేస్తాయి. కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు పొగాకు అలవాటు ఉన్నప్పుడు.. ఆ పరోక్ష ప్రభావం కూడా ఆస్తమాకు దారితీస్తుంది. ఆధునిక అధ్యయనాల ప్రకారం.. ఊబకాయం కూడా తొలి ముద్దాయిల జాబితాలో నిలుస్తున్నది.
ఆహార పద్ధతుల ద్వారా ఆస్తమాను కొంతమేర దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతారు. అల్లం, ఆవాల నూనె, అత్తిపండ్లు, వెల్లుల్లి తరచూ తీసుకోవడం మంచిదని చెబుతారు. ఇన్ఫ్లుయెంజా, న్యుమోనియా టీకాలతో ఆస్తమాను కట్టడి చేయవచ్చు. ఎలర్జీ కలిగించే వాతావరణాలు, ఘాటు వాసనలు మొదలైనవాటికి దూరంగా ఉండటం ఉత్తమం. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం.
వంటగది, బాత్రూమ్, పడకగది మొదలైనవాటిని తరచూ శుభ్రం చేయాలి. ప్రాథమికంగా ఇది శ్వాసనాళాలు కుంచించుకుపోవడం వల్ల వచ్చే సమస్య కాబట్టి.. ఆ వ్యవస్థను సురక్షితంగా కాపాడుకుంటే చాలు. ఈ మహమ్మారి పిల్లలనూ వదిలిపెట్టడం లేదు. చిన్నారులలో శ్వాసకు సంబంధించి ఏ సమస్య ఉన్నా వెంటనే నిపుణులను సంప్రదించాలి. ఏటా మే రెండో తేదీని ‘ఆస్తమా డే’గా జరుపుకొంటారు. ‘ఆస్తమా కేర్ ఫర్ ఆల్’ ఈ ఏడాది నినాదం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

