చుండ్రుకు సవాల్! (యాపిల్ సైడర్ వెనిగర్)
డాక్టర్లతో పన్లేదు. రసాయనాల తలంటు అవసరం లేదు. ‘యాపిల్ సైడర్ వెనిగర్'తో చుండ్రు సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. దీన్ని పులియబెట్టిన యాపిల్ జ్యూస్ నుంచి తయారు చేస్తారు.
డాక్టర్లతో పన్లేదు. రసాయనాల తలంటు అవసరం లేదు. ‘యాపిల్ సైడర్ వెనిగర్’తో చుండ్రు సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. దీన్ని పులియబెట్టిన యాపిల్ జ్యూస్ నుంచి తయారు చేస్తారు. యాపిల్ సైడర్ వెనిగర్ (ఏసీవీ)కు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇది ఫంగస్ సృష్టించే చుండ్రును నివారిస్తుంది.
1 నీటితో..
ఒక మగ్ నిండా శుభ్రమైన నీళ్లు తీసుకుని.. దానిలో టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి గిలక్కొట్టాలి. తర్వాత, ఆ మిశ్రమాన్ని తలకు దట్టంగా పట్టించి.. కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
2 నిమ్మరసంతో..
అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీటితోనూ, ఆపైన రోజూవాడే షాంపూతోనూ శుభ్రం చేసుకోవాలి.
3 టీ ట్రీ ఆయిల్‌తో..
మగ్గిన అరటిపండును మెత్తగా చేసి, అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ఆయిల్‌తో కలపాలి. దానికి నాలుగైదు చుక్కల టీ ట్రీ ఆయిల్ జతచేయాలి. ఈ పేస్ట్‌ను కుదుళ్లకు పట్టించి, అరగంట తర్వాత.. వెచ్చని నీటితో ఒకసారి, షాంపూతో ఒకసారి శుభ్రం చేసుకోవాలి.
4 బేకింగ్ సోడాతో..
అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి కొన్ని నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
5 చామంతి టీతో..
అరకప్పు చామంతి టీలో, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు దట్టంగా పట్టించాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

6 ఆలివ్ ఆయిల్‌తో..
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో అర టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. జుట్టు కుదుళ్లకు పట్టించి, అరగంట సేపు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

7 అలొవెరా జెల్‌తో..
రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్‌ను అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌తో కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి 20 నుంచి 25 నిమిషాల తర్వాత ఒకసారి గోరువెచ్చని నీటితో, ఒకసారి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

