Health Tips | ఎముకలు ధృడంగా మారాలంటే ఇలా చేయాలి..!
శారీరకంగా చురుకుగా ఉండేందుకు, శరీర కదలికలు సాఫీగా సాగేందుకు ఆరోగ్యకరమైన ఎముకలు (Health Tips) అవసరం. కీలక అవయవాలను కాపాడేందుకు, తీవ్ర అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూడటంలో బోన్స్ పాత్ర ముఖ్యమైనదే.
న్యూఢిల్లీ : శారీరకంగా చురుకుగా ఉండేందుకు, శరీర కదలికలు సాఫీగా సాగేందుకు ఆరోగ్యకరమైన ఎముకలు (Health Tips) అవసరం. కీలక అవయవాలను కాపాడేందుకు, తీవ్ర అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూడటంలో బోన్స్ పాత్ర ముఖ్యమైనదే. సమతులాహారం, వ్యాయామం, ముప్పు కారకాలకు దూరంగా ఉండటం వంటి ఎముకల అనుకూల జీవనశైలి అనుసరించాలి.
జీవితంలో ప్రతి దశలోనూ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎముకలను ధృడంగా చేసుకోవడంపై దృష్టి సారించాలి. అయితే యాక్టివ్‌గా లేని జీవనశైలి, అనారోగ్యకర ఆహార అలవాట్లు పెరగడంతో ప్రజలు ఎముకల బలహీనం సహా బోన్ సంబంధిత అనారోగ్యాలకు గురవడం పెరుగుతోంది. దీర్ఘకాలం ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మున్ముందు ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్ర అనారోగ్యాల బారినపడే ప్రమాదం పొంచిఉందని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ డింపుల్ జంగ్ధా చెప్పుకొచ్చారు. ఎముకల ఆరోగ్యానికి అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుందని ఆమె సూచించారు.
ఇది ఎముక కణజాలాన్ని ఉత్పత్తి చేసే కణాల సంఖ్యను పెంచుతుంది. ఇది వాపును కూడా తగ్గించడంతో పాటు ఎముక మెరుగ్గా కోలుకునేందుకు మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు. ఇక పసుపు ఎముకలో మినరల్ లాస్‌ను నిరోధించడంతో పాటు ఎముక సాంద్రతను కాపాడుతుంది. పసుపును వివిధ వంటకాల్లో వాడటం ద్వారా ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నువ్వుల నూనె ఎముకలను బలోపేతం చేయడంతో పాటు బోన్ లాస్‌ను నిరోధిస్తుంది. నువ్వుల నూనెలో ఉండే జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, ఒమెగా-3 ఆమ్లాలు, ప్రొటీన్ ఎముకల సంబంధిత సమస్యలను నివారిస్తాయి.
Read More :
Tomato | చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు.. త్వరలో కిలో రూ.300కు చేరే అవకాశం..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

