Cousin Marriage | డాక్టర్ గారూ నమస్తే! ఆరునెలలక్రితం మాకు పెండ్లయింది. నాకు కానీ, మా ఆయనకు కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. కానీ మాది మేనరికం. దీనివల్ల పుట్టబోయే పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉందా? పిల్లల ప్లానింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఓ పాఠకురాలు
చాలా మంది ఈ ప్రశ్న అడిగారు. మేనరికం పేరుతో దగ్గరి బంధువులను పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ.. పెండ్లికి ముందు, తర్వాత జన్యు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చు. పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు.
గర్భధారణ సమయంలో జరిపే పరీక్షల సాయంతో తలసీమియాలాంటి జన్యు సంబంధ రుగ్మతలను గుర్తించవచ్చు. హృద్రోగాలకు కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి గర్భస్థ పిండంలో లోపాలను తెలుసుకోవడానికి తరచూ స్కానింగ్ చేయించుకోవాలి. మీరు వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించండి. ఎవరైనా నిరుత్సాహపరిచినా పట్టించుకోవద్దు.
– డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్ నిలోఫర్ పిల్లల దవాఖాన హైదరాబాద్