Hair fall | మిగిలిన సీజన్లతో పోలిస్తే ఎండాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా?
Hair fall | ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. ఒకరు మంచిదని చెబుతారు. ఒకరు ప్రమాదకరమని హెచ్చరిస్తారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని విస్మరించాలి? ఆరోగ్యకరమైన కేశాల కోసం ఆరాటపడేవారిని వేధిస్తున్న ప్రశ్నలివి. ప్రతి ప్రశ్నకూ శాస్త్రీయమైన జవాబు ఉంది..
Hair fall | ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. ఒకరు మంచిదని చెబుతారు. ఒకరు ప్రమాదకరమని హెచ్చరిస్తారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని విస్మరించాలి? ఆరోగ్యకరమైన కేశాల కోసం ఆరాటపడేవారిని వేధిస్తున్న ప్రశ్నలివి. ప్రతి ప్రశ్నకూ శాస్త్రీయమైన జవాబు ఉంది..
రోజూ తలస్నానం మంచిది కాదు.
బయటికి వెళ్లామంటేనే.. కాలుష్యంలో తల పెట్టినట్టే. దుమ్ము, ధూళి చేరిపోతుంది. చెమట కారిపోతుంది. జిడ్డు పేరుకుపోతుంది. తలస్నానం చేయడమే మంచిది. కాకపోతే, నాణ్యమైన షాంపూ వాడితే చాలు.
నూనె పట్టించకూడదు.
కారు ప్రయాణికుడికి సీట్బెల్ట్లా, బైక్ రైడర్‌కు హెల్మెట్‌లా.. జుట్టుకు నూనె. దీనివల్ల రక్షణ లభిస్తుంది. మెరుపు వస్తుంది. నూనెలోని ఫ్యాటీయాసిడ్స్.. వెంట్రుకలు కోల్పోయిన లిపిడ్స్‌ను భర్తీ చేస్తాయి.
కత్తిరించుకున్న కొద్దీ పెరుగుతుంది.
గుండు చేయించుకుంటే జుట్టు పెరుగుతుందని అంటారు. తరచూ కత్తిరించినప్పుడు మొక్క చిగురించినట్టు, జుట్టు కూడా కొత్తగా మొలుస్తుందని ఊదరగొడతారు. ఇవన్నీ అబద్ధాలే. వెంట్రుకలు చిట్లిపోవడం మాత్రం కొంతమేర తగ్గుతుంది.
వేసవిలో ఎక్కువగా రాలుతుంది.
ఇది కూడా అపోహే. నిజానికి మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో జుట్టు పెరుగుదల పది నుంచి పదిహేను శాతం వేగవంతం అవుతుంది. కాకపోతే, దానికి మనవంతు మద్దతు అందించాలి. మండుటెండలో వెళ్లినప్పుడు టోపీ పెట్టుకోవాలి.
షాంపూ మారుస్తూ ఉండాలి.
అలా అని కచ్చితంగా చెప్పలేం. కానీ మనం ఎంచుకునే షాంపూలో రసాయనాలు నామమాత్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆర్గానిక్ షాంపూ అయితే మరీ మంచిది. అందులోనూ పారాబెన్స్, సల్ఫేట్స్ శాతం ఎంత తగ్గితే అంత మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

