ఈ సూపర్ ఫుడ్‌తో మీ ఎముకలు ఫిట్!

న్యూఢిల్లీ : ఆరోగ్యకరమైన ఎముకలు శారీరక ఆరోగ్యానికి కీలకం. ధృడమైన ఎముకలు శరీరానికి తీరైన ఆకృతి ఇవ్వడంతో పాటు శరీరానికి వెన్నుదన్నుగా నిలుస్తాయి. అనారోగ్యకరమైన ఎముకలు ఆస్టియోసొరొసిస్, రికెట్స్, బోన్ క్యాన్సర్, బోన్ ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. సరైన ఆహారం, శారీరక వ్యాయామంతో ఎముక పుష్టిని పెంచుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి సహజసిద్ధమైన ఆహారం ఉపకరిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో కూడిన నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాల్నట్స్, బాదం, పల్లీలను నిత్యం ఆహారంలో బాగం చేసుకోవాలి. ఇక ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమెగా ఈ ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన సాల్మన్ చేపలను తరచూ తినాలి. వీటితో విటమిన్ డీ కూడా పుష్కలంగా లభిస్తుంది.
ఇక ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం కోసం నిత్యం పాలు తాగాలి. పాలలో ఓట్స్ కలుపుకుని తీసుకోవచ్చు. ప్రొటీన్ కూడా సరైన మోతాదులో ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుంది. ప్రొటీన్ బాగా లభించే గుడ్లను రోజూ క్రమంతప్పకుండా తీసుకోవాలి. ఇక ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

