High Cholesterol | కొలెస్ట్రాల్ పెరిగిందా..? ఈ చిట్కాలు పాటించి తగ్గించుకోండి..!
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
High Cholesterol | మారిన మన జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతున్నది. అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. హై కొలెస్ట్రాల్ లక్షణాలు బయటకు కనిపించకుండానే మనల్ని చంపేస్తుంటాయి. శరీరం బరువు, శరీరంలోని కొవ్వు ఆధారంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అంచనా వేయవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
శరీరంలో హార్మోన్లు, విటమిన్ డీ ఉత్పత్తికి, ఆహార జీర్ణక్రియలో సాయపడే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. కొలెస్ట్రాల్ ముఖ్యంగా మన శరీరంలోని కాలేయం నుంచి ఉత్పత్తి అవుతుంది. మిగిలిన కొవ్వులు మనం తినే ఆహారాల ద్వారా శరీరంలోకి చేరుతాయి. ఇది లిపో ప్రోటీన్లు అనే ప్యాకెట్లలో రక్తంలో ప్రయాణిస్తుంది. శరీరంలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్లయితే గుండె జబబులు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మందులు కొలెస్ట్రాల్‌ను మెరుగుపర్చేందుకు సాయపడతాయి. కొన్ని జీవనశైలిలో మార్పులు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించేందుకు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
గుండెకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు..
సంతృప్త కొవ్వులను తీసుకోవడం తగ్గించుకోవాలి. ఇవి ప్రధానంగా రెడ్ మీట్, ఫుల్ ఫ్యాట్ పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్లను తొలగించుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా లభించే ఆహారాలు తినేలా చూసుకోవాలి. ఆవు నెయ్యి, సాల్మన్ చేపలు, వాల్నట్లు, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ లభిస్తాయి. కరిగే ఫైబర్‌ను పెంచుకోవాలి. ఇవి రక్తప్రవాహంలోకి కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది.
నిత్యం వ్యాయామం చేయడం..
వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేసేలా చూసుకోవాలి. నిత్యం అర్ధ గంటకు తక్కువ కాకుండా శారీరక వ్యాయామాలు చేయడం అలవర్చుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
సిగరెట్ స్మోకింగ్ మానుకోవడం..
సిగరెట్ స్మోకింగ్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు పెరుగుతాయి. అందుకని చెడు కొలెస్ట్రాల్ అందించే సిగరెట్ తాగడాన్ని మానుకోవాలి.
సరైన బరువు నిర్వహణ..
శరీరం అధిక బరువు లేదా ఊబకాయం చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరం బరువును తగ్గించుకోవడం ద్వారా 5-10 శాతం వరకు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునే వీలుంటుంది.
మితంగా ఆల్కహాల్ తీసుకోవడం..
మద్యం తాగే అలవాటున్నవారు ఆల్కహాల్ తీసుకోవడాన్ని మితంగా చేసుకోవాలి. 65 ఏండ్ల పైబడిన వయసున్న వారు నిత్యం ఒక ఔన్స్ తీసుకోవడం వరకు ఇబ్బంది లేదు. అయితే, మితిమీరిన ఆల్కహాల్ సేవనం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో దోహదపడుతుంది. అధిక ఆల్కహాల్ తాగే అలవాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలివీ..
నిద్రిస్తున్న సమయంలో కాళ్లలో తీవ్రమైన తిమ్మిర్లు వస్తాయి. రక్త ప్రవాహం వేగం తగ్గడం వలన శరీర చర్మం రంగును మారే అవకాశాలు ఉంటాయి. కాళ్లకు తగినంత ఆక్సిజన్ అందక బరువుగా అనిపిస్తాయి. పలు భాగాల్లో మంట, నొప్పిగా ఉంటుంది. అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉన్నవారిలో పాదాలు, కాళ్లు చల్లగా అనిపిస్తాయి. మెడ, దవడ, కడుపు, వీపు భాగంలో నొప్పి కనిపిస్తే అది కొలెస్ట్రాల్ సమస్యగా భావించాలి. రక్తంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు కళ్లపై పసుపు మచ్చలు కనిపిస్తాయి. విపరీతంగా చెమటలు పడతాయి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.
ఇది కూడా చూడండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

