జుట్టు తగ్గినట్టు అనిపిస్తుందా?
నెత్తిమీద చేయిపెడితే జుట్టు తగ్గినట్టుగా అనుమానించడం, అద్దంలో చూసుకోవడం, అంతా బాగానే ఉందనుకోవడం చాలామందికి అనుభవమే. ఇలాంటి సందేహం వచ్చినప్పుడు దానిని నివృత్తి చేసుకుంటే మంచిది. నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకుంటే జుట్టు తగ్గడాన్ని చాలా ముందుగా గుర్తించవచ్చు. ఆ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. చాలామందికి జుట్టు రాలడమే తెలుసు. కొందరిలో జుట్టు సన్నబడిపోయే సమస్యా ఉంటుంది.
నెత్తిమీద చేయిపెడితే జుట్టు తగ్గినట్టుగా అనుమానించడం, అద్దంలో చూసుకోవడం, అంతా బాగానే ఉందనుకోవడం చాలామందికి అనుభవమే. ఇలాంటి సందేహం వచ్చినప్పుడు దానిని నివృత్తి చేసుకుంటే మంచిది. నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకుంటే జుట్టు తగ్గడాన్ని చాలా ముందుగా గుర్తించవచ్చు. ఆ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. చాలామందికి జుట్టు రాలడమే తెలుసు. కొందరిలో జుట్టు సన్నబడిపోయే సమస్యా ఉంటుంది. వెంటుకలు తయారయ్యే కుదుళ్లలో జరిగే జీవ రసాయన మార్పుల వల్ల వెంట్రుకల మందం తగ్గిపోతుంది. మందం తగ్గడం వల్ల జుట్టు ఒత్తుగా కనిపించినా, నెత్తిమీద చేయి ఆన్చితే జుట్టు తగ్గిందనిపిస్తుంది.
ఇలా వెంట్రుకలు సన్నబడటాన్ని ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’ అంటారు. ఈ సమస్యకు రెండు రకాల కారణాలుంటాయి. జన్యు సంబంధమైన కారణాల వల్ల కొందరిలో ఇలా జరుగుతుంది. దీనిని నివారించడం సాధ్యం కాదు. మరికొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే మార్పులతో వెంట్రుకలు పలుచబడతాయి. వెంట్రుకలు పలుచబడటం మొదలైతే దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ మార్పువల్ల మొదట తలకట్టు తగ్గిపోతుంది. కొన్నాళ్లకు కొంత జుట్టు రాలిపోతుంది. కాబట్టి హార్మోన్ల అసమతుల్యతకు కారణాలు తెలుసుకుని సరిచేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

