పొద్దున్నే లేస్తే.. శుభోదయం!

ఉదయాన్నే నిద్ర లేచేవారు టైప్-2 డయాబెటిస్ బారిన పడే ఆస్కారం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు వల్ల బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా త్వరగా పూర్తి చేస్తారు. దీంతో రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్, చక్కెర స్థాయిలు అదుపులోనే ఉంటాయంటున్నారు పరిశోధకులు. భోజనం చేసే సమయం, రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని అమెరికాలో జరిపిన ఓ సర్వేలో 10,571మందిని పరిశీలించి మరీ తేల్చారు. తొందరగా బ్రేక్ ఫాస్ట్ చేసిన వారిలో రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుందనీ, ఇన్సులిన్ స్థాయిలో హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయనీ నిర్ధారించారు. మన ఆహార వేళలతో మన శరీర జీవక్రియ ముడిపడి ఉంటుంది. ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం రోజులో అతి ముఖ్యమైన భోజనం. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది. అందుకే ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ లాంటివి ఎక్కువగా ఉన్న అల్పాహారంతో రోజును ప్రారంభించడం మంచిది. పళ్లెంలో పండ్లు, గింజలు, పెరుగు, కూరగాయలు, గుడ్లు తదితరాలు ఉండేలా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

