Menarche నా కూతురు పదేండ్లకే పెద్ద మనిషి అవుతుందేమో అనిపిస్తుంది.. కారణం అదేనా?
నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దపాప పదకొండేండ్లకే రజస్వల అయింది. ఇప్పుడు చిన్నదానికి పదేండ్లు. తొమ్మిదో ఏడు నుంచే రొమ్ముల్లో మార్పులు వచ్చాయి. తను కూడా త్వరగానే పెద్దమనిషి అవుతుందేమో అనిపిస్తున్నది. గేదెలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్నారనీ, ఆ పాలు తాగడం వల్లే పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారనీ చెబుతున్నారు. నిజమేనా.
Menarche | నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దపాప పదకొండేండ్లకే రజస్వల అయింది. ఇప్పుడు చిన్నదానికి పదేండ్లు. తొమ్మిదో ఏడు నుంచే రొమ్ముల్లో మార్పులు వచ్చాయి. తను కూడా త్వరగానే పెద్దమనిషి అవుతుందేమో అనిపిస్తున్నది. గేదెలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్నారనీ, ఆ పాలు తాగడం వల్లే పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారనీ చెబుతున్నారు. నిజమేనా. అయిదారు తరగతుల్లో రజస్వల అయితే వాళ్లకూ ఇబ్బందిగానే ఉంటుంది.
– ఓ పాఠకురాలు
వాతావరణం, ఆహారం.. ఇలా వివిధ కారణాల వల్ల పిల్లలు త్వరగా పెద్దమనిషి అవుతున్నారు. మీరు విన్నది కూడా నిజమే. ఎక్కువ పాలు రావాలని పశువులకు ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దీంతో వాటి నుంచి వచ్చే పాలలోనూ ఆ హార్మోన్ ప్రభావం ఉంటుంది. వాటిని తాగినప్పుడు ఆడ పిల్లలు త్వరగా పెద్దమనిషి అయ్యే అవకాశాలున్నాయి. నిజానికి ఒక్క పాలే కాదు.. వాతావరణ కాలుష్యమూ ఓ కారణమే.
కలుషితమైన గాలిలోని డయాక్సిన్లు, ఈస్ట్రోజెన్ హార్మోన్లు కూడా దీనికి కారణం అవుతున్నాయి. అంతేకాదు, ఇప్పటి తల్లులు పిల్లల మీద అపారమైన శ్రద్ధ చూపుతున్నారు. గతంతో పోలిస్తే వాళ్లకు అందే పోషకాల శాతమూ పెరుగుతున్నది. అందువల్ల ఎదుగుదల వేగవంతం అవుతున్నది. అధిక బరువు కూడా చిన్న వయసులోనే రజస్వల కావడానికి ఒక కారణం అవుతున్నది. ఇప్పటి లెక్కల్లో పది దాటాక పెద్దమనిషి కావడం పెద్దగా కంగారుపడే విషయంకాదు. ఎనిమిదేండ్ల వయసును ఆ కోవ కిందికే తీసుకుంటున్నారు.
– డాక్టర్ పి. బాలాంబ, సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health
- issues
- Menarche
- Mensturation
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

