వైట్‌ఫంగస్ ప్రమాదకరం కాదు

- ముందుగానే గుర్తిస్తే జయించవచ్చు
- ఈ వ్యాధి కేసులు చాలా తక్కువ
- కంటి వైద్యుడు డాక్టర్ వివేక్ ప్రవీణ్ దవే
ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్. కరోనాను జయించామన్న సంతోషాన్ని ఆవిరిచేస్తూ అనేకమందిని బ్లాక్‌ఫంగస్ పట్టిపీడిస్తున్నది. ఇప్పుడు దీనికి తోడు వైట్‌ఫంగస్ అందరినీ బెంబేలెత్తిస్తున్నది. శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గిపోయిన వారిలో వైట్ ఫంగస్ ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. ఈ వ్యాధిపై ఎవరికీ పూర్తిగా తెలియకపోవటం కూడా ప్రజలను మరింత భయానికి గురిచేస్తున్నది. ఇది బ్లాక్ ఫంగస్కంటే ప్రమాదకరమని కొందరు, అంత ప్రమాదమైనది కాదని మరికొందరు చెప్తుండటంతో అయోమయం నెలకొన్నది. దీనిని సకాలంలో గుర్తిస్తే వైట్ ఫంగస్ ప్రమాదమైనదేమీ కాదని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ ప్రవీణ్ దవే చెప్తున్నారు. వైట్ ఫంగస్ గురించి ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
–హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ
వైట్ ఫంగస్ అంటే ఏమిటి?
వైట్ ఫంగస్ శాస్త్రీయ నామం కాండిడా అల్ఫికాన్సీ. ఇది సహజంగానే మన శరీరం లోపల, బయట ఉంటుంది. కానీ అది అతిగా పెరిగితే ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ల్యాబొరేటరీలో దాన్ని పరిశీలిస్తే తెల్లగా కనిపిస్తుంది. అందువల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ను వైట్ ఫంగస్ అంటారు. ఇది కంటి గుడ్డులోని వివిధ బాగాలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఏ భాగానికైనా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలేంటి?
వైట్ ఫంగస్ కంటిలోని రెటీనాపై ప్రభావం చూపుతుంది. కండ్ల్లు ఎర్రబడి నొప్పి వస్తుంది. కంటిముందు నల్లని నీడ ఛాయలు లేదా కంటి ముందు తేలియాడుతున్నట్టు ఉంటుంది. ఇది కొంతమేర దృష్టిలోపానికి దారితీస్తుంది. కరోనా సోకిన వెంటనే లేదా కోలుకున్నవారిలో వైట్ ఫంగస్ ప్రభావం కనబడుతుంది. దీని ప్రభావంతో కొవిడ్ నుంచి కోలుకున్న 1 నుంచి 3 నెలల్లో కంటిచూపు తగ్గే అవకాశం ఉన్నది.
ఈ వ్యాధి సోకడానికి కారణం?
కరోనా చికిత్సకే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు స్టెరాయిడ్లు అధిక డోస్‌లో వాడటం, ఎక్కువ రోజులు దవాఖానల్ల్లో ఉండటంవంటి కారణాలవల్ల వ్యక్తుల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. వైరస్‌లను ఎదుర్కొనే శక్తిలేనివారిలో ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం మరింత పెరుగుతుంది. ఈ వ్యాధి కండ్లకు మాత్రమే సోకితే ప్రమాదం ఉండదు. శరీరానికి మొత్తం సోకితే ప్రాణాంతకం. కొవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్‌ను పోల్చడానికి సరైన గణాంకాలు లేవు. వైట్ ఫంగస్ కేసులు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి.
బ్లాక్ ఫంగస్‌కు.. వైట్ ఫంగస్‌కు తేడా ఏంటి?
మ్యుకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ప్రధానంగా కంటి చుట్టూ ఉండే కణజాలం, ముక్కులోని సైనస్పై దాడిచేస్తుంది. అందుకు భిన్నంగా వైట్ ఫంగస్ కంటి లోపలి కణజాలం విట్రస్ జల్, రెటినాను ప్రభావితం చేస్తుంది. వైట్ ఫంగస్ గురించి పూర్తిగా తెలుసుకొంటే భయపడాల్సిన పనిలేదు. సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించగలిగితే ఎలాంటి ప్రమాదముండదు.
చికిత్స విధానాలేమైనా ఉన్నాయా?
వైట్ ఫంగస్‌ను నియంత్రించేందుకు ఇంట్రాకోక్యురీ సర్జరీ, కంటిలోపల యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు, నోటి ద్వారా యాంటీ ఫంగల్ మందులను అందించాలి. రక్తం లో చక్కెర స్థాయిలను నియంత్రించాలి. దీన్ని ఎదుర్కోవాలంటే రోగి రోగ నిరోధకశక్తి పెంచడం చాలా ముఖ్యం.
వైట్ ఫంగస్ ఎవరికి ఎక్కువ ప్రమాదకారి?
తక్కువ రోగ నిరోధక శక్తి ఉండి, రక్తంలో అధికంగా షుగర్స్థాయి ఉన్న రోగులకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కరోనా వైరస్ సోకి కోలుకున్న తర్వాత (మొదటిసారి జ్వరం వచ్చిన 6 నుంచి 8 వారాల లోపు) ఇది సోకవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో రోగిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. డయాబెటిస్, సిస్టమెటిక్ ఇమ్యునో సస్ప్రెషన్
(తక్కువగా రోగ నిరోధక శక్తి), ఇతర క్రానిక్ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ
ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

