Rice water benefits | గంజితో బోలెడు లాభాలు.. తెలిస్తే వేస్ట్ చేయరు..!
Rice water benefits | బియ్యంను కడిగి వండినప్పుడు దానిలోని పోషకాలన్నీ గంజిలో ఇమిడిపోయి.. దాన్ని తీసుకున్నప్పుడు ఆ పోషకాలు మనకు అందుతాయి. అయితే, గంజితో లాభాలు బోలెడు ఉన్నాయన్న విషయం తెలియక...
Rice water benefits | గంజి.. ఒకప్పుడు పేదలు తినేవారు.. ఇప్పుడది పెద్దింటి వారి స్టేటస్ సింబల్‌గా మారింది. బెంజిలో తిరిగినా గంజి మరవను అని ఓ సినిమా డైలాగ్ గంజి గొప్పదనాన్ని తెలియజేస్తున్నది. బియ్యంను కడిగి వండినప్పుడు దానిలోని పోషకాలన్నీ గంజిలో ఇమిడిపోయి.. దాన్ని తీసుకున్నప్పుడు ఆ పోషకాలు మనకు అందుతాయి. అయితే, గంజితో లాభాలు బోలెడు ఉన్నాయన్న విషయం తెలియక చాలా మంది దాన్ని వేస్ట్ చేస్తున్నారు. గంజిలో బోలెడన్ని విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కడుపులో మంట రావడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కొన్ని రకాల జబ్బులు రాకుండా గంజి తోడ్పడుతుంది.
- గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. విటమిన్ల లోపం రాకుండా చూసుకోవచ్చు. పిల్లలకు గంజి తాగిస్తే చాలా మంచిది. వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
- విరేచనాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.
- పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటిని అయినా తాగించాలి. దాంతో వారికి కావల్సిన ఆహారం అంది శక్తి లభిస్తుంది. పోషణ సరిగ్గా ఉంటుంది.
- చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజినీటిని పోసి సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో దురదలు తగ్గిపోతాయి.
- వేసవిలో శక్తి త్వరగా అయిపోయి ఎవరైనా సరే నీరసం చెందుతుంటారు. అలాంటి వారు గంజి నీరు తాగితే మంచిది. శక్తిని మళ్లీ పుంజుకుంటారు.
- వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు శరీరం పోషకాలను కోల్పోతుంది. అలాంటప్పుడు గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
- గంజిలో పోషకాలు విరివిగా ఉండి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
- గంజిని షాంపుగా, హెయిర్ కండీషనర్‌గా వాడటం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
- గంజిలో అల్లాంటన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను నివారిస్తాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల..రంధ్రాలను క్లెన్స్ చేసి.. చర్మాన్ని బిగుతుగా మార్చి, కాంప్లెక్షన్ ని పెంచుతుంది.
- బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మరింత శక్తినిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

