Cancer Vaccine | గుడ్ న్యూస్.. త్వరలోనే క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు !
Cancer Vaccine | హృద్రోగాలు, క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కబళిస్తున్నాయి. దీన్ని నిరోధించే వ్యాక్సిన్లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్ల నుంచి కృషి చేస్తున్నారు.
Cancer Vaccine | లండన్: హృద్రోగాలు, క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కబళిస్తున్నాయి. దీన్ని నిరోధించే వ్యాక్సిన్లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్ల నుంచి కృషి చేస్తున్నారు. క్యాన్సర్‌తోపాటు హృద్రోగాలు, ఆటో ఇమ్యూన్ డిసీజ్లకు చెక్ పెట్టగలిగే ఈ వ్యాక్సిన్లు 2030 లోగా సిద్ధమవుతాయని, తద్వారా లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు బలంగా చెప్తున్నారు.
ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్లపై జరిగిన అధ్యయనాలు కూడా గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయని, 15 ఏండ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం 12-18 నెలల్లోనే సాధించి కొవిడ్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా రూపొందించగలగడమే ఈ నమ్మకానికి కారణమని పేర్కొంటున్నారు. వచ్చే ఐదేండ్లలోగా తాము అన్ని రకాల జబ్బులకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురాగలమని ప్రముఖ ఫార్మా కంపెనీ మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాల్ బర్టన్ ధీమా వ్యక్తం చేశారు. మోడెర్నా ప్రస్తుతం వివిధ రకాల కణుతులను టార్గెట్ చేసే క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్టు ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

